పన్నీర్ పక్కనే కమల్: పోయెస్ గార్డెన్ లో పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది !

పోయెస్ గార్డెన్ లో ఇప్పుడు పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటోంది, జయ ఇంటి వెనుకనే పన్నీర్ సెల్వం కొత్త ఇంటిలో కాపురం పెట్టారు. పన్నీర్ సెల్వం నివాసం ఉండే ప్రాంతంలోనే బహుబాషా నటుడు కమల్ హాసన్ నివాసం .

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొత్త నివాసంలో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోయెస్ గార్డెన్ కు కూతవేటు దూరంలో ఉన్న అళ్లార్ పేటలోని వీనస్ కాలనీలోని కొత్త ఇంటిలో పాలుపొంగించి కాపురం పెట్టారు.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం వెనుకనే పన్నీర్ సెల్వం ఇల్లు ఉండటం విశేషం. పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే తీరులో విధ్వేషాలు చోటు చేసుకున్నాయి.

Panneerselvam has performed house warming in new house at Venus Colony yesterday

చెన్నైలోని అడయారు గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రభుత్వ క్వాటర్స్ లో ఉన్న పన్నీర్ సెల్వంను బయటకు పంపించి పగ తీర్చుకోవాలని శశికళ వర్గం నిర్ణయించుకునింది. అయితే పన్నీర్ సెల్వం శశికళ వర్గం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పోయెస్ గార్డెన్ పక్కనే మకాం పెట్టారు.

జయలలిత తరువాత అన్నాడీఎంకే పార్టీలో అంత ప్రధాన్యత ఉన్న వ్యక్తిగా పన్నీర్ సెల్వం ఉండేవారు. అయితే అమ్మ మరణం తరువాత పన్నీర్ సెల్వంకు కష్టాలు మొదలైనాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు తమ పదవిని కోల్పోయిన తరువాత ఆరు నెలల పాటు ప్రభుత్వ క్వాటర్స్ లో ఉండే అవకాశం ఉంది.

అయితే ఆ నిబంధనలను పట్టించుకోకుండా పన్నీర్ సెల్వంకు తమిళనాడు ప్రభుత్వం వెంటనే క్వాటర్స్ ఖాళీ చెయ్యాలని నోటీసులు ఇచ్చింది. పన్నీర్ సెల్వం సైతం తన మీద ప్రభుత్వం పెత్తనం చెలాయించకుండా చూడటానికే వెంటనే వీనస్ కాలనీలో ఇల్లు చూసుకుని మకాం మార్చేశారు.

ఇప్పుడు పన్నీర్ సెల్వం మీద ప్రజల్లో మరింత సానుభూతిపెరిగింది. కొత్త ఇంటి నుంచి పన్నీర్ సెల్వం తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు శశికళ వర్గీయులు పన్నీర్ సెల్వ ఇంటి మీద నిఘా వేశారు.
పన్నీర్ సెల్వం నివాసం ఉండే వీనస్ కాలనీ సమీపంలోనే బహుబాషా నటుడు కమల్ హాసన్ నివాసం ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+