Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంజీఆర్ కు నివాళి అర్పించడానికి శశికళకు టైం లేదు !

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శనివారం చెన్నైలోని మెరీనా బీచ్ చేరుకుని దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)కు నివాళులు అర్పించారు.

ఎంజీఆర్ 29వ వర్దంతి సందర్బంగా మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ స్మారక మందిరం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పన్నీర్ సెల్వంతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న మంత్రులు, అన్నాడీఎంకే నాయకులు ఎంజీఆర్ కు నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా సీఎం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజల మనోభావాలు కాపాడటానికి ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీ స్థాపించారని, ఆయన తరువాత అమ్మ జయలలిత పార్టీని ముందుకు నడిపించారని అన్నారు.

Panneerselvam paid homage to former Chief Minister M G Ramachandran

అన్నాడీఎంకే పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త ఎంజీఆర్, జయలలిత ఆశయాల కోసం పని చెయ్యాలని మనవి చేశారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం సవ్యంగానే ప్రజల కోసం పని చేస్తుందని పన్నీర్ సెల్వం అన్నారు.

రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప (అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించింది) తన అనుచురులతో కలిసి ఎంజీఆర్ స్మారక మందిరం దగ్గరకు చేరుకుని నివాళులు అర్పించారు.

అయితే జయలలిత నెచ్చెలి శశికళ మాత్రం ఎంజీఆర్ స్మారక మందిరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. శశికళతో పాటు ఆమెకు అత్యంత సన్నిహితులైన మంత్రులు సైతం ఎంజీఆర్ కు నివాళులు అర్పించడానికి మెరీనా బీచ్ దగ్గరకు రాలేదని కార్యకర్తలు అన్నారు.

Panneerselvam paid homage to former Chief Minister M G Ramachandran

ఎంజీఆర్ స్థాపించిన పార్టీ పగ్గాలు మాత్రం కావాలని అంటున్నారు కాని ఆయన వర్దంతి సందర్బంగా నివాళులు అర్పించడానికి మాత్రం వీరు రాలేదని అన్నాడీఎంకే కార్యకర్తలు మండిపడుతున్నారు.

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పన్నీర్ సెల్వం అన్ని పనులు పక్కన పెట్టి ఎంజీఆర్ కు నివాళులు అర్పించారని, ఎలాంటి పదవి లేకున్నా శశికళకు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడానికి మాత్రం ఆమెకు టైం లేదని విమర్శించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంజీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+