అన్యాయం జరిగింది: పన్నీరు సెల్వం కోసం ప్రాణత్యాగం
మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కోసం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్వంకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గత బుధవారం మూసా (37)అనే అభిమాని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కోసం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్వంకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గత బుధవారం మూసా (37)అనే అభిమాని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తీవ్ర గాయాలపాలైన అతడిని కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మూసా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇటీవల తమిళ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తనని తీవ్రంగా కలచి వేశాయని, పన్నీర్‌కు అన్యాయం జరిగిందని మూస ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పన్నీరు సెల్వం, మాజీ మంత్రులు పాండ్యరాజన్, పొన్నయన్, కేపీ మునుస్వామిలు బాధితుడిని పరామర్శించి ఖర్చుల నిమిత్తం రూ.1లక్షను కుటుంబ సభ్యులకు అందించారు.
పెరియ కాంచీపురం ప్రాంతానికి చెందిన మూసా పెయింటర్‌గా పని చేసేవాడు. మూసాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శశికళకు వ్యతిరేకంగా, పన్నీరుకు మద్దతుగా నినాదాలు చేస్తూ వానిగర్ వీధిలోకి వచ్చిన మూసా.. తనతోపాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications