శశికళకు టాటా, మీ సేవలు చాలు చిన్నమ్మ; అత్యవసర భేటీ, పన్నీర్ కు ఇవే పదవులు!
చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను శాశ్వతంగా పార్టీ నుంచి సాగనంపేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. శశికళ, టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి సాగనంపిన తరువాతే అసలు కథ మొదలుకానుంది.
చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర భేటీకి సీఎం ఎడప్పాడి పళనిసామి పిలుపునివ్వడంతో ఆపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అందరూ చెన్నై చేరుకున్నారు. పన్నీర్ సెల్వం శిభిరానికి చెందిన ప్రిసీడీయం చైర్మన్ మధుసూదనన్ అధ్యక్షతన అన్నాడీఎంకే పార్టీ సమవేశం నిర్వహిస్తున్నారు.

టార్గెట్ శశికళ
శశికళను పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపేందుకు తగ్గ కసరత్తులు మొదలైనాయి. అన్నాడీఎంకే నియమనిబంధనల్లో ఇందుకు తగ్గ సవరణలతో ప్రత్యేక తీర్మానం చెయ్యడానికి ఇరు వర్గాల నాయకులు సిద్దం అయ్యారు. ఇదే సమయంలో ఇరువర్గాల విలీనం వ్యవహారం తేల్చనున్నారు.
Recommended Video


పదవుల పందేరాలు కొలిక్కి !
అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి అమ్మ శిబిరాలు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. పళనిసామి, పన్నీర్ సెల్వం శిబిరాలు ఒకే వేదికగా ముందుకుసాగేందుకు సిద్దం అయ్యారని తెలుసుకున్న అన్నాడీఎంకే కేడర్ ఇప్పుడు ధీమాగా ఉంది.

అమావాస్య రోజు
సోమవారం అమావాస్య కావడంతో తమిళ ప్రజలు శుభకరంగా భావిస్తారు. అదే రోజు విలీనం విషయంలో తేల్చేయాలని పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు సిద్దం అయ్యాయి. చట్ట సవరణలు సాగినా, విలీనం ప్రక్రియ జరిగినా దానిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాల నాయకులు అంటున్నారు.

శశికళ ఔట్, వెంటనే పన్నీర్
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన తరువాత రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో పన్నీర్ సెల్వం అడుగుపెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

పన్నీర్ సెల్వంకు ఇవే పదవులు
పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే పార్టీ నిర్వహక అధ్యక్ష పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి, ప్రజా పనుల శాఖ అప్పగించనున్నారు. పన్నీర్ సెల్వం వర్గంలోని మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడానికి ఇప్పటికే పళనిసామి అంగీకరించారని సమాచారం.












Click it and Unblock the Notifications