జైల్లో జయ: సెల్వం ప్రమాణం, సీఎం-మంత్రులు ఏడ్చారు

చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేస్తూ భావోద్వేగానికి లోనైన పన్నీర్ సెల్వం కంటతడి పెట్టారు. సెల్వం తమిళనాడుకు 28వ సీఎం. కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టర్మ్‌లో తమిళనాడు కేబినెట్ 16సార్లు విస్తరించారు.

కాగా, కారణం అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలుకావడంతో ఆమె స్దానంలో ఓ పన్నీర్ సెల్వంను తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా నియమించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఓ పన్నీర్ సెల్వం రెండోసారి సీఎం కాబోతున్నారు.

ఐతే ఇప్పుడు తాజాగా పన్నీర్ సెల్వం కూడా టీకొట్టు నడిపిన కుటుంబం నుంచే రావడంతో... తమిళపత్రికలు ఓ పన్నీర్ సెల్వాన్ని ప్రధాని నరేంద్రమోడీతో పోల్చుతున్నాయి. పన్నీర్ సెల్వం 1951లో తేనీ జిల్లా పెరయకుళంలో జన్మించారు. తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించి టీ కొట్టుని నడిపారు.

గతంలో ఆయన నడిపిన టీ కొట్టుని... ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యలు నడుపుతున్నారు. పన్నీర్ సెల్వం, స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితకు వీరాభిమాని. ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.

తనకు వీరాభిమానిగా ఉన్న పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే తేని జిల్లా కార్యదర్శిగా నియమించిన జయలలిత 1996లో పెరియకులం మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యేలా చేశారు. ఇక 2001లో పెరియకులం ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న పన్నీర్ సెల్వం, జయలలిత మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల్లోనే కేబినెట్‌లో కీలక మంత్రిగా ఎదిగిన పన్నీర్ సెల్వం, జయలలతకు నమ్మినబంటు.

ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

 ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. పన్నీరు సెల్వంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

 ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. పన్నీరు సెల్వంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో సెల్వం ప్రమాణ స్వీకారం చేయడంతో.. మంత్రులు కూడా ప్రమాణం చేయాల్సి వచ్చింది.

ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. పలువురు మంత్రులు కూడా కంటతడి పెట్టారు.

 ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. పన్నీరు సెల్వంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

 ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. పలువురు మంత్రులు కూడా కంటతడి పెట్టారు.

జైల్లో జయ: సెల్వం ప్రమాణం, సీఎం-మంత్రులు ఏడ్చారు

జైల్లో జయ: సెల్వం ప్రమాణం, సీఎం-మంత్రులు ఏడ్చారు

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత నమ్మినబంటు పన్నీరు సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అతను తమిళనాడుకు 28వ ముఖ్యమంత్రి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+