టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు.. కేక్ కోసి పండగ చేసుకున్న తల్లిదండ్రులు
అందరికీ ఇలాంటి తల్లిదండ్రులు ఉండకపోవచ్చు. కన్న కుమారుడు టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయితే కుటుంబం మొత్తం పండగ చేసుకుంది. కేక్ కట్ చేసి.. స్వీట్స్ తినిపించుకుంటూ సెలబ్రేట్ చేసుకుంది. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి నిరాశగా ఉన్న ఆ యువకుడికి మేమున్నాం.. బాధపడకు అంటూ ఓదార్చారు. అంతేకాక కుటుంబ సభ్యులు అందరూ కలిసి పండగ చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
జీవితంలో కష్టసుఖాలు, గెలుపు ఓటములు సహజం. అలాగే పరీక్షల్లో పాస్, ఫెయిల్ కూడా సహజం. పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఖతం అయినట్లు కాదు అని చెబుతున్నారు ఆ తల్లిదండ్రులు. టెన్త్ పరీక్షల్లో అట్టర్ ఫెయిల్ అయిన తన కుమారుడిని ఓదార్చి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కర్ణాటక బాగల్ కోట్ లోని బసవేశ్వరా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అభిషేక్ అనే యవకుడు పదోతరగతి చదువుతున్నాడు. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో 600 మార్కులకు గాను అభిషేక్ కు 200 మార్కులు మాత్రమే వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో ఆ విద్యార్థి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అతనికి 32 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో టెన్త్ ఫలితాల్లో అభిషేక్ ఫెయిల్ అయ్యాడు.
దీంతో అభిషేక్ ఫ్రెండ్స్, బంధువులు అతడ్ని చూసి నవ్వడం ప్రారంభించారు. అభిషేక్ నిరాశలో ఉన్నాడు. అది గమనించిన అభిషేక్ పేరెంట్స్.. తాము కూడా తిడితే ఇంకా బాధపడతాడని గ్రహించి అతడ్ని ఓదార్చారు. అంతేకాక పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోలేదని నచ్చజెప్పారు. అందరూ సంతోషంగా కేక్ కట్ చేసి ఓటమినీ ఆనందంగా జరుపుకున్నారు.
నీవు పరీక్షలో ఫెయిల్ అయ్యావు.. కానీ జీవితంలో కాదు. నీవు మరోసారి ప్రయత్నించి విజయం సాధించవచ్చు అని అభిషేక్ లో స్ఫూర్తిని నింపారు ఆ తల్లిదండ్రులు. ఈ విషయంపై అభిషేక్ మాట్లాడుతూ..'నేను ఫెయిల్ అయినా నా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు. నేను మళ్లీ పరీక్ష రాసి పాస్ అవుతాను. జీవితంలోనూ విజయం సాధిస్తాను' అని అభిషేక్ చెప్పుకొచ్చాడు.
ఏదేమైనా ప్రస్తుతం యువత చిన్నచిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న తరుణంలో ఇలాంటి తల్లిదండ్రులు ఉన్న అభిషేక్ నిజంగా జీవితంలో ఏదైనా సాధించగలడని.. అందరూ తమ పిల్లలపై ఇలాంటి నిర్ణయంతోనే ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications