మద్యం మత్తులో టార్చర్ పెడుతున్న కొడుకు, అర్దరాత్రి తల్లిదండ్రులు ఏం చేశారంటే ?
చెన్నై/ తిరుప్పూర్: దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. దంపతులకు వయసు మీదపడింది. ఇదే సమయంలో ఎదిగి వచ్చిన కొడుకు కష్టపడి డబ్బులు సంపాధించి తమను పోషిస్తాడని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే లిక్కర్ సేవించడానికి బానిస అయిన కొడుకు నిత్యం మద్యం సేవించి వచ్చి అతని తల్లిదండ్రులకు నరకం చూపించాడు.
మద్యం మత్తులో రోజూ తల్లిదండ్రులను కొట్టే కుమారుడిని అతని తల్లీ, తండ్రీ ఇద్దరూ కలిసి హత్య చేశారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా ఊతుకుళి పక్కనే ఉన్న తాడ్గో ప్రాంతానికి చెందిన సెల్వరాజ్, శాంతామణి దంపతులకు మణికందన్ (26) అనే కుమారుడు ఉన్నాడు. మణికందన్ మద్యానికి బానిసై పనికి సరిగా వెళ్లకుండా రోజు జులాయిగా తిరుగుతున్నాడు.

మణికందన్ తల్లిదండ్రులు కూలీకి వెళ్లి వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మద్యం మత్తులో ఉన్న మణికందన్ గత వారం రోజులుగా తల్లి దండ్రులను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని పీడిస్తున్నాడని, రోజు ఇంట్లో గొడవ చేస్తున్నాడని స్థానికులు పోలీసులకు చెప్పారు..
దీంతో మణికందన్ టార్చర్ తో అతని తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన మణికందన్ తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని తరువాత వారిని చితకబాదేశాడు. రాత్రి కిక్కు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు ఉన్న పక్క రూమ్ లో మణికందన్ పడుకున్నాడు.

శుక్రవారం మణికందన్ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మణికందన్ తండ్రి సెల్వరాజ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా మద్యం మత్తులో తమను వేధిస్తున్న తన కొడుకును మేమే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఇక ఈ హత్యలో మణికందన్ తల్లి శాంతామణి కూడా భాగస్వామి కావడంతో పోలీసులు మణికందన్ తండ్రి సెల్వరాజ్, తల్లి శాంతామణిని అరెస్ట్ చేసి కేసు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications