కులగణనపై కేంద్రం సంచలన ప్రకటన!

లోక్‌సభలో బుధవారం హైడ్రామా చోటుచేసుకుంది. మహిళా రిజర్వేషన్లు, కులగణన అస్త్రాలతో ప్రతిపక్షం కేంద్రాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేసింది. "మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రం ఎందుకు ఇంత తొందరపడుతోంది? ముందుగా జనాభా గణనను పూర్తి చేయండి" అంటూ అఖిలేష్ యాదవ్ చేసిన డిమాండ్‌తో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సమయంలోనే హోం మంత్రి అమిత్ షా తనదైన శైలిలో విమర్శలను తిప్పికొట్టారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, కానీ డీలిమిటేషన్ ముసుగులో ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. "జనాభా గణన పూర్తయిన వెంటనే మేము కులగణనను డిమాండ్ చేస్తాం. ఆ డేటా బయటకు వస్తేనే రిజర్వేషన్ల అసలు స్వరూపం వెలుగులోకి వస్తుంది. అది ఇష్టం లేకనే మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు" అని అఖిలేష్ మండిపడ్డారు. ప్రధాని మోదీ గతంలో ఓట్ల కోసం తాను వెనుకబడిన కులం నుంచి వచ్చానని చెప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

Parliament Clash Amit Shah vs Akhilesh Yadav Over Caste Census and Muslim Reservation in Lok Sabha
డీలిమిటేషన్ కుట్ర: 'గెర్రీమాండరింగ్' అంటూ రాహుల్ గాంధీ ధ్వజం!
డీలిమిటేషన్ కుట్ర: 'గెర్రీమాండరింగ్' అంటూ రాహుల్ గాంధీ ధ్వజం!

హామీ ఇస్తున్నా.. కులగణన జరుగుతుంది: అమిత్ షా

అఖిలేష్ ఆరోపణలకు అమిత్ షా అంతే ధీటుగా స్పందించారు. జనాభా గణన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, 2027లో జరిగే జనాభా గణనలో కుల వివరాలను కూడా సేకరిస్తామని సభాముఖంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఎస్పీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. "సమాజ్‌వాదీ పార్టీకి అవకాశం ఇస్తే, వారు మనుషులకే కాదు.. ఇళ్లకు కూడా కులాన్ని కేటాయించేస్తారు" అని ఎద్దేవా చేశారు.

Delimitation: తలవంచిన జగన్! ఆ గూటికి చేరేందుకే ఈ వ్యూహం?
Delimitation: తలవంచిన జగన్! ఆ గూటికి చేరేందుకే ఈ వ్యూహం?

ముస్లిం రిజర్వేషన్లపై ముదిరిన వివాదం

చర్చ ముస్లిం రిజర్వేషన్ల వైపు మళ్లినప్పుడు సభలో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా తేల్చి చెప్పారు. దీనిపై అఖిలేష్ స్పందిస్తూ.. "ముస్లిం మహిళలు 'ఆది ఆబాదీ' (సగం జనాభా)లో భాగం కాదా? వారు రిజర్వేషన్ల పరిధిలోకి రారా?" అని ప్రశ్నించారు. దీనికి షా స్పందిస్తూ.. "మీ పార్టీ ఇచ్చే టిక్కెట్లన్నీ ముస్లిం మహిళలకే ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు.. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు మాత్రం సాధ్యం కాదు" అని కౌంటరిచ్చారు.

మొత్తానికి, కులం-మతం-రిజర్వేషన్ల చుట్టూ తిరిగిన ఈ చర్చ పార్లమెంటులో ప్రధాన పార్టీల మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యాన్ని మరోసారి బయటపెట్టింది. లోక్‌సభలో వాగ్వాదం ఇలా ఉంటే, రాజ్యసభలో పత్రాల సమర్పణ అనంతరం సభ వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+