పునర్విభజన: అధికారం కోసం దేనికైనా? చంద్రబాబుపై కాంగ్రెస్ ఫైర్..!

కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజనకు (delimitation 2026) ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ (congress party) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సిద్దాంతాల కంటే అధికారమే ముఖ్యమని చంద్రబాబు మరోసారి నిరూపిస్తున్నారని మాణిక్కం ఠాకూర్ ఆరోపించారు.

YS Sharmila :
YS Sharmila :

సొంత మామగారికే ద్రోహం చేయగల వ్యక్తి, ఇప్పుడు తన రాజకీయ మనుగడ కోసం ఏపీ భవిష్యత్తుతో రాజీపడటానికి సిద్ధపడ్డారని మాణిక్కం ఠాకూర్ విమర్శించారు. నరేంద్ర మోడీతో కలిసి నిలబడి, దక్షిణాది గొంతును బలహీనపరిచే వివక్షాపూరిత డీలిమిటేషన్‌కు ఆయన మద్దతు ఇస్తున్నారన్నారు. దానిని ఎదిరించడానికి బదులుగా, ఆయన పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడం గురించి మాట్లాడుతున్నారుని, అన్యాయాన్ని ఎదుర్కోవడం తప్ప అన్నీ చేస్తున్నారన్నారు. సరైన కుల గణన జరగకముందే ఈ చర్యకు మద్దతు ఇవ్వడం ద్వారా, మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా పార్లమెంటులోకి ప్రవేశించాల్సిన బీసీ మహిళలకు ఆయన తలుపులు మూసివేస్తున్నారన్నారు. ఇది నాయకత్వం కాదని, పథకం ప్రకారం లొంగిపోవడమే అన్నారు.

Congress mp Slams Chandrababu for Surrendering Andhra s Future Over Delimitation
Delimitation: లోక్ సభ సీట్లపై బిగ్ టర్న్..! జనాభా ప్లాన్ వెనక్కి-దక్షిణాదికి హామీ ?
Delimitation: లోక్ సభ సీట్లపై బిగ్ టర్న్..! జనాభా ప్లాన్ వెనక్కి-దక్షిణాదికి హామీ ?

కేంద్రం ప్రతిపాదించిన 2011 జనాభా లెక్కల ఆధారిత డీ లిమిటేషన్ ప్రక్రియ రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తోందని, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తుకు పెను ముప్పు అని వైఎస్ షర్మిల విమర్శించారు. దీని వల్ల ఏఏపీ తన స్వరం మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల భవిష్యత్ ఆర్థిక అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో, దక్షిణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రంగా అన్యాయం చేసే ఈ ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు మీరు బహిరంగంగా, స్పష్టంగా వ్యతిరేకత తెలియజేయాలని చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 లోక్‌సభ సభ్యులు, 11 రాజ్యసభ సభ్యులు అందరినీ, పార్టీ భేదాలు లేకుండా ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+