Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..!

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య మూడు విదేశీ పాస్ పోర్టులు కలిగిఉన్నారంటా ఆరోపణలు చేసిన వ్యవహారంలో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు ఇవాళ సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయనకు గతంలో అస్సాం పోలీసులు అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీనిపై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మ తనపై పవన్ ఖేరా చేసిన ఆరోపణలపై దాఖలు చేసిన కేసులో.. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు గతంలో వారం రోజుల ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. గత శుక్రవారం తెలంగాణ హైకోర్టు పవన్ ఖేరాకు ఈ ముందస్తు బెయిల్ ఇచ్చింది.

SC Stays Pawan Khera s Relief in Passport Row with Riniki Bhuyan Sharma

జస్టిస్ కె.సుజన నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ముందస్తు బెయిల్ కోసం తగిన వేదికను ఆశ్రయించడానికి ఆయనకు వారం రోజుల సమయం ఇచ్చింది. ఆయన లాయర్ మరింత సమయం కోరినా సుప్రీం అంగీకరించలేదు. అస్సాం పోలీసులు దాఖలు చేసిన కేసులో ఆయన వేగంగా స్పందించి హైదరాబాద్ లో తలదాచుకున్నారని, ఆయన ప్రభావవంతమైన వ్యక్తి అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+