Anna Canteen:పేదలకు ఊరట-అన్న క్యాంటీన్లను విస్తరించిన సీఎం చంద్రబాబు

"ఆకలి లేని సమాజమే అసలైన అభివృద్ధికి నిదర్శనం.. పేదవాడి కడుపు నిండని ప్రగతికి అర్థం లేదు" అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త సంక్షేమ యజ్ఞంలో మరో కీలక అడుగు వేశారు. బుధవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ఆయన నూతన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.

సామాన్యుడిలా భోజనం.. పేదలతో ముఖాముఖి

క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి స్వయంగా రూ. 5 చెల్లించి టోకెన్ కొనుగోలు చేశారు. సామాన్యులతో కలిసి కూర్చుని భోజనం చేయడమే కాకుండా, అక్కడికి వచ్చిన పేదలకు స్వయంగా వడ్డించి తన ఉదారతను చాటుకున్నారు. భోజనం నాణ్యత, రుచి మరియు పరిశుభ్రత గురించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.

ap-cm-chandrababu-naidu-inaugurates-rural-anna-canteens-in-palnadu-expands-5-meal-scheme-across-sta

విస్తరిస్తున్న అన్న క్యాంటీన్ల నెట్‌వర్క్

గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వం విస్తరించింది.రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.దీనితో రాష్ట్రంలో మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి చేరుకుంది. త్వరలోనే మరో 5 క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు.గత 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించామని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 243 కోట్ల సబ్సిడీ ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు వివరించారు.

ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యం

స్వర్గీయ నందమూరి తారకరామారావు రూ. 2 కే కిలో బియ్యం పథకంతో ఆహార భద్రతకు పునాది వేశారని, ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అన్నార్థుల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ, రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు ఇది ఒక గొప్ప వరమని అన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. పేదలకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్ల వంటి పథకాలను నిలిపివేసి, వినాశకర రాజకీయాలకు పాల్పడ్డారని సీఎం మండిపడ్డారు. పేదవాడి నోటికాడ ముద్దను లాగేసిన చరిత్ర వారిదని దుయ్యబట్టారు.

పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన ఈ అన్న క్యాంటీన్ల విస్తరణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కొండంత అండగా నిలుస్తోంది. రూ. 5లకే నాణ్యమైన భోజనం లభిస్తుండటంతో సామాన్య జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+