Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..!
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇవాళ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరైన ఆయన.. కాఫీ కబుర్లు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ ఇంఛార్జ్‌లతో భేటీ అయ్యారు. రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం-అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పైనా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను, వైసీపీ దుర్మార్గాల్ని సామాన్య కార్యకర్తలు కూడా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. క్లీన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్సుగా టీడీపీని నిలిపేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలని, పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలని సూచించారు. గతానికంటే టీడీపీ ఓట్ బ్యాంక్ పెరగాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.

గతంలో వైసీపీ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే, కూటమి ప్రభుత్వం వాటిని తగ్గిస్తోందన్నారు. ఇంకా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు. సమగ్ర నీటి నిర్వహణతో భూగర్బ జలాలు పెంచడంతో పాటు ప్రాజెక్టుల్లో నీరు నింపాం. మే 15వ తేదీనే పంటలకు నీళ్లు ఇస్తామన్నారు. దామాషా ప్రకారం ప్రతీ కులానికి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పిస్తామని, నీతి నిజాయితీగా ఉంటేనే విలువగల రాజకీయాలు చేయగలుగుతామని తెలిపారు. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ అనే వ్యవస్థను తెస్తామన్నారు. కార్యకర్తలు ఆరోగ్యంగా ఉండాలని, రోజూ యోగా చేయాలని, యోగా ట్రైనర్స్ ద్వారా జిల్లాలో శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications