Parliament: ఘర్షణల వరకూ వచ్చేసిన ఎంపీలు? 7 షాకింగ్ రీజన్స్- సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ ట్వీట్..!

గతంలో పార్లమెంట్ (Parliament) సమావేశాలంటే ప్రజలకు ఓ గౌరవం ఉండేది. అధికార, విపక్షాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా అధికార ఎన్డీయే వ్యవహరిస్తున్న తీరు, దానికి కౌంటర్ గా విపక్ష ఇండియా కూటమి చేపడుతున్న నిరసనలు ఇప్పుడు శృతి మించిపోయాయి. ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో అధికార, విపక్ష ఎంపీలు వేర్వేరుగా పోటాపోటీ ఆందోళనలకు దిగారు. అక్కడితో ఆగకుండా ఘర్షణలు పడ్డారు. ఈ పరిస్ధితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన పార్లమెంట్ లో ఇలాంటి పరిస్దితులు రావడానికి ముఖ్యంగా 7 కారణాలున్నాయని తెలిపారు.

1990ల ఆరంభం నుండి పార్లమెంటును కవర్ చేస్తున్న తాను, పార్లమెంటు ప్రాంగణంలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య దాదాపు ఘర్షణ జరిగిన ఈ దృశ్యాలను చూసి తీవ్రంగా నిరాశ చెందానని రాజ్ దీప్ ట్వీట్ చేసారు. ఎలాంటి పరిస్ధితులు ఇలా జరుగుతుందో ఆయన ఏడు సందర్భాలు చెప్పారు. ఇందులో ఒకటి.. రాజకీయాలు తీవ్రంగా పోలరైజ్ అయిపోయి, తీవ్ర పక్షపాతంగా మారినప్పుడు, రెండు ఒకప్పుడు పార్టీల మధ్య నిజమైన చర్చలకు అద్భుతమైన వేదికగా ఉన్న సెంట్రల్ హాల్‌ను మూసివేసినప్పుడు, కోవిడ్ కాలంలో తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయాన్ని వీలైనంత త్వరగా రద్దు చేయాలన్నారు.

Parliament Clash Scare Rajdeep Sardesai Reveals 7 Reasons Behind Ruling Party-Opposition Face-Off

మూడో సందర్భం అధికార పార్టీ పార్లమెంటును ఒక నోటీసు బోర్డులా పరిగణిస్తే, ప్రతిపక్షం మాత్రం తమ ఆవేదనను వెళ్లగక్కడానికి సభను ఏకైక వేదికగా భావించినప్పుడు అన్నారు. నాలుగు కేవలం అధికార పక్షాన నిలబడటం కోసం, ఎంపీలు ఎలాంటి శిక్షా భయం లేకుండా ఒక పక్షం నుండి మరొక పక్షానికి ఫిరాయించినప్పుడు అన్నారు. ఐదో సందర్భం పార్లమెంటరీ పనులలోని కష్టాన్ని అనుభవించడానికి చాలా తక్కువ మంది ఎంపీలు మాత్రమే సుముఖంగా ఉన్నప్పుడు అని తెలిపారు. ఆరో సందర్భం సీనియర్ ఎంపీలు, మంత్రులు ఆదర్శంగా నిలవడంలో విఫలమైనప్పుడు, వారిలో చాలామంది రావలసినంత తరచుగా సభకు రానప్పుడు కూడా అన్నారు. ఏడో సందర్భం సభ గౌరవాన్ని, తటస్థతను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా ఉండాల్సిన సభాపతి స్థానంలోని వారు, తరచుగా కనీస నిష్పాక్షికతను కూడా ప్రదర్శించడంలో విఫలమవుతున్నారని గుర్తుచేశారు.

Parliament Clash Scare Rajdeep Sardesai Reveals 7 Reasons Behind Ruling Party-Opposition Face-Off

పార్లమెంటు అంటే కేవలం సభలో ఒకరిపై ఒకరు అరుచుకోవడం మాత్రమే కాదు. అది సభలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా అని రాజ్ దీప్ గుర్తుచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్, సోమనాథ్ ఛటర్జీ, జైపాల్ రెడ్డి వంటి వారు ఎంతో గుర్తుకొస్తున్నారని ఆయన తెలిపారు. వీరు చర్చలలోని వాదోపవాదాలను ఆస్వాదించడమే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత శత్రువులు కానవసరం లేదని కూడా అర్థం చేసుకున్న అద్భుతమైన పార్లమెంటేరియన్లు అని కితాబిచ్చారు. మనం పార్లమెంటరీ మర్యాద కంటే ఎంతో విలువైన దానిని కోల్పోతున్నామన్నారు. అదే పార్లమెంటు సంస్కృతి అని, స్వాతంత్ర్య 80వ సంవత్సరంలో ఇది అత్యంత ఆందోళనకరమంటూ రాజ్ దీప్ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+