తెలుగువారి కోసం లోక్సభ కీలక నిర్ణయం!

పార్లమెంటు సమావేశాలపై దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అలాంటి పార్లమెంట్ సమావేశాలను దేశంలోని ప్రతి పౌరుడికి మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో లోక్‌సభ సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది. సంసద్ టీవీ ప్రసారాలను తెలుగుతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చి శుభవార్త చెప్పింది. ఈ నిర్ణయంతో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడనుంది.అన్ని ప్రాంతాల వారు వారి భాషలోనే దేశం కోసం పార్లమెంట్ చేస్తున్న పనులు, కీలక నిర్ణయాలను తెలుసుకోవచ్చు.

పార్లమెంట్ కీలక నిర్ణయం

ఇప్పటివరకు పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు చేసే ప్రసంగాలను ప్రధానంగా హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలకు అందించేవారు. అయితే దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజలకు ఆ భాషలు రాకపోవటం కారణంగా పార్లమెంటు చర్చలు పూర్తిగా అర్థం అయ్యేవి కావు. దీనిని దృష్టిలో ఉంచుకొని, సభ్యులు చేసే ప్రసంగాలను ఆయా ప్రాంతీయ భాషల్లోకి ఏకకాలంలో అనువదించి ప్రసారం చేసే విధానాన్ని లోక్‌సభ సచివాలయం ప్రారంభించింది.

parliament good news to telugu people telugu speeches by lok sabha sansad tv along with 22 languages

ప్రజల కోసం ప్రాంతీయ భాషల్లో పార్లమెంట్ సమావేశాలు

ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూలో పొందుపరిచిన 22 భారతీయ భాషల్లో ఏ భాషలోనైనా పార్లమెంటు సభ్యులు మాట్లాడవచ్చు. సభ్యులు తమ మాతృభాషల్లో మాట్లాడినప్పుడు, మిగతా సభ్యులు అర్థం చేసుకునేలా హిందీ, ఇంగ్లిష్‌లోకి అనువదించే విధానం పార్లమెంట్ లో అమల్లో ఉంది. ఇప్పుడు అదే అనువాద వ్యవస్థను మరింత విస్తరించి, ప్రజల కోసం కూడా ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయనున్నారు.

పార్లమెంట్ వ్యవహారాలపై ప్రజలకి అవగాహన పెంచే ప్లాన్

ఈ కొత్త విధానం ద్వారా ప్రజలు తమ మాతృభాషల్లోనే పార్లమెంటు చర్చలు, ప్రసంగాలు, కీలక నిర్ణయాలను ప్రత్యక్షంగా వినే అవకాశం లభించనుంది. దీంతో ప్రజలకు దేశ పార్లమెంట్ లో ఏం జరుగుతుంది కష్టం లేకుండా తెలుసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజలకు పార్లమెంటు వ్యవహారాలపై అవగాహన పెంచడంతో పాటు, ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది శుభవార్త

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. పార్లమెంటులో జరిగే చర్చలు, చట్టాలపై చర్చలు, ప్రభుత్వ విధానాల వివరాలు ఇకపై తెలుగులోనే వినిపించనున్నాయి. ఇది దేశంలోని మారుమూల పల్లెల్లో కూడా వాళ్ళ భాషలోనే పార్లమెంట్ చర్చలు తెలుసుకోవచ్చు. దీనివల్ల రాజకీయ అవగాహన పెరగడంతో పాటు, ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతీ పౌరుడికి సంసద్ టీవీ ప్రసారాలు వారి భాషలోనే

సంసద్ టీవీ ప్రసారాలను టెలివిజన్‌తో పాటు యూట్యూబ్ లింక్ ద్వారా కూడా ప్రాంతీయ భాషలలో వీక్షించవచ్చని లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సౌకర్యంతో దేశంలోని ప్రతి పౌరుడు ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా పార్లమెంటు కార్యకలాపాలను తమ భాషలో వీక్షించే అవకాశం పొందనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+