లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా..ఆయనే: రేపట్నుంచే పార్లమెంట్: గరంగరం

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం సమీపించింది. సోమవారం నుంచి లోక్‌సభ, రాజ్యసభలు సమావేశం కానున్నాయి. వచ్చేనెల 13వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తంగా 19 రోజుల పాటు పార్లమెంట్ సమావేశమౌతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రొటోకాల్స్ మధ్య పార్లమెంట్ సమావేశమౌతుంది.

ప్రతి సభ్యుడికీ కరోనా వైద్య పరీక్షలను నిర్వహించిన తరువాతే.. సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన తరువాత తొలిసారిగా పార్లమెంట్ సమావేశం కానుంది. కొత్తగా లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరిస్తోన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని ఆ హోదా నుంచి తప్పిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది.

Parliament Monsoon session: Congress Parliamentary Party reconstitutes groups of its MPs

అధిర్ రంజన్‌ను పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో ఆయన స్థానంలో యువ ఎంపీలకు అవకాశం కల్పిస్తారంటూ వార్తలొచ్చాయి. అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేదు. సభాపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరిని కొనసాగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం- లోక్‌సభలో అధిర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ పక్ష నేతగా కొనసాగుతారు. అస్సాంకు చెందిన గౌరవ్ గొగొయ్ ఉప సభాపక్ష నేతగా వ్యవహరిస్తారు. కేరళకు చెందిన కోడికున్నిల్ సురేష్ చీఫ్ విప్‌గా, రవ్‌నీత్ సింగ్ బిట్టు, మాణిక్కం ఠాగూర్ విప్‌లుగా ఉంటారు.

Recommended Video

    #TOPNEWS: AP 10th And Inter Exams| Kadtal Farmhouse|Vizag Steel Plant Privatization| Oneindia Telugu

    మనీష్ తివారీ, శశిథరూర్ పార్టీ తరఫున రోజువారీ సభపక్ష వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గె కొనసాగుతారు. ఉప నేతగా ఆనంద్ శర్మ, చీఫ్ విప్‌గా జైరామ్ రమేష్ ఉంటారు. కేంద్ర మాజీమంత్రులు అంబికా సోని, పీ చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్ పార్టీ సభ్యులను సమన్వయ పరుస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ఉత్తర్వులు జారీ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+