పాత పార్లమెంట్ భవనంలో అదే చివరి రోజు: మోదీ ఏం చేయబోతున్నారంటే..?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేయబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
దీన్ని మరింత బలపరిచేలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి.

ఇందులో ఎలాంటి అంశాలు, బిల్లులు చర్చకు రానున్నాయనేది ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ భేటీ సందర్భంగా సభలో ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనిపై ఇదివరకే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ సైతం రాశారు.
ఇదిలావుండగా- ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంల కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీ హాలులో ఈ మధ్యాహ్నం ఈ భేటీ ఏర్పాటైంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం- దీనికి సంబంధించిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మొదటి రోజు పాత పార్లమెంట్ హౌస్‌లో సభ సమావేశమౌతుందని తెలిపారు. ఆ మరుసటి రోజు అంటే 19వ తేదీన పాత పార్లమెంట్‌లో ఫోటో సెషన్ నిర్వహిస్తామని వివరించారు.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఈ ఫొటో సెషన్‌కు హాజరవుతారని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఫొటో సెషన్ అనంతరం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ప్రత్యేకంగా ఓ వేడుకలను నిర్వహించబోతోన్నామని తెలిపారు. ఆ తరువాతే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడతామని అన్నారు.
సెప్టెంబర్ 19వ తేదీన కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు ప్రారంభమౌతాయని, 20వ తేదీ నుంచి రెగ్యులర్ భేటీలు కొత్త భవనంలో షెడ్యూల్ చేశామని తెలిపారు. సభలో చర్చ సందర్భంగా ఎలాంటి బిల్లులు ప్రవేశపెడతారు? ఎలాంటి అంశాలపై చర్చిస్తారు?, మహిళా రిజర్వేషన్ బిల్లు గానీ, జమిలి ఎన్నికల ప్రతిపాదనలు గానీ టేబుల్ అవుతాయా? లేదా? అనేది స్పష్టం చేయలేదు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications