వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఎంఆర్ఐ మెషీన్‌లో పేషెంట్‌ను మర్చిపోయారు!, ఊపిరాడక..

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామని మెషీన్‌లోకి పంపించిన వైద్యులు, సిబ్బంది తిరిగి అతడ్ని బయటకు తీయడం మర్చిపోయారు. దీంతో ఊపిరాడక ఆందోళన చెందిన ఆ వ్యక్తి.. మెషీన్‌ను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు.

భుజం ఎముక పక్కకు జరగడంతో..

భుజం ఎముక పక్కకు జరగడంతో..

హర్యానాలోని పంచకుల సివిల్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రమ్హర్ లోహన్ అనే 59ఏళ్ల వ్యక్తి బైక్‌పై నుంచి పడటంతో అతని భుజం ఎముక పక్కకు జరిగింది. దీంతో అతడు ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఆదివారం నాడు పంచకుల ఆస్పత్రికి వచ్చాడు.

అరగంటైనా బయటికి తీయలేదు..

అరగంటైనా బయటికి తీయలేదు..

లోహన్‌ను ఎంఆర్ఐ మిషీన్‌లోకి పంపించిన వైద్యులు, సిబ్బంది.. అతడ్ని 10 నుంచి 15 నిమిషాలపాటు అందులోనే ఉండాలని చెప్పారు. దీంతో అతడు అలాగే చేశాడు. అయితే, అరగంట గడిచినప్పటికీ ఎవరూ అతడ్ని బయటకి తీసుకురాలేదు.

ఊపిరాడక..

ఊపిరాడక..

ఈ క్రమంలో అతనికి ఊపిరాడక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కాసేపు అరిచి ఏడ్చినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో ఆ మెషీన్‌ను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి తన ప్రాణాలను కాపాడుకున్నట్లు అతడు మీడియాకు వెల్లడించాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పంచకుల సివిల్ సర్జన్ డాక్టర్ యోగేష్ శర్మ మీడియాకు తెలిపారు.

వైద్య సిబ్బంది ఇలా.. రోగి అలా..

వైద్య సిబ్బంది ఇలా.. రోగి అలా..


కాగా, లోహన్ చేస్తున్న ఆరోపణలను ఎంఆర్ఐ సెంటర్ ఇంఛార్జ్ అమిత్ ఖోఖర్ మాత్రం ఖండిస్తున్నారు. తాము అతడ్ని 20 నిమిషాలపాటు మెషీన్‌లో ఉండమన్నామని తెలిపారు. అతడ్ని మెషీన్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సాయం చేశామని కూడా తెలిపారు. అవసరమైతే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లోహన్ డిమాండ్ చేశారు. స్థానికులు కూడా లోహన్‌కు మద్దతుగా నిలిచారు. ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇటు రోగి లోహన్, అటు ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Patient breaks out of MRI machine after hospital staff forgets him inside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X