వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయస్కాంతం దెబ్బ: ఎంఆర్ఐ మిషన్‌కు యువకుడి బలి

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ఓ రోగికి తోడుగా ఆస్పత్రికి వచ్చిన యువకుడు ఎంఆర్ఐ మిషన్‌కు బలయ్యాడు. బంధువుకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించడానికి అతను ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల అతను కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు వదిలాడు.

ఆక్సిజన్ సిలిండర్‌తో రోగిని ఎంఆర్ఐ స్కానింగ్ గదిలోకి తీసుకుని వెళ్లిన వ్యక్తి స్కానింగ్ యంత్రంలోని అయస్కాంతం ఆకర్షించడంతో అందులో ఇరుక్కుని మరణించాడు. ముంబైలోని బివిఐఎల్ నాయర్ చారిటబుల్ ఆస్పత్రిలో శనివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. తనకు బంధువైన మహిళకు స్కానింగ్ చేయించేందుకు రాజేష్ మారు (32) శనివారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చాడు.

Patient’s relative sucked into MRI unit at Hospital, dies

లోహపు వస్తువులు, బంగారం, జిప్‌లు, బటన్‌లు ఉంటే ఎంఆర్ఐ గదిలోకి అనుమతించరు. కానీ రాజేశ్‌తో సహా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుి ఉన్న రోగిని స్ట్రెచర్పై వార్డు బాయ్ స్కానింగ్ గదిలకి పంపించాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

లోహపు వస్తువులను ఎంఆర్ఐ గదిలోకి అనుమతించరు కదా అని తాము బాయ్‌ని అడిగామని, కానీ తాము రరోజూ ఇలాగే పనిచేస్తామని, ఏమీ కాదని సమాధానం చెప్పాడని వారంటున్నారు. స్కానింగ్ యంత్రం ఆపేసి ఉందని చెప్పాడని అన్నారు.

దానికి వైద్యుడు, టెక్నీషియన్ ఏమీ మాట్లాడలేదని రాజేశ్ బంధువు హరీశ్ సోలంకి చెప్పారు. సిలిండర్‌ను స్కానింగ్ యంత్రంలోని అయస్కాంతం బలంగా ఆకర్షించింది. సిలిండర్‌తో పాు పక్కన ఉన్న రాజేశ్ కూడా వెళ్లి యంత్రానికి అతుక్కుపోాడు. అతని చేయి యంత్రంలో ఇరుక్కుపోయింది.

ఆ సమయంలో సిలిండర్ మూత ఊడిపోయి ద్రవరూపంలోని అక్సిజన్ విడుదలైందని చెబుతున్నారు. స్కానింగ్ యంత్రంలో ఇరుక్కుపోయిన రాజేశ్‌ను వార్డుబాయ్‌తో కలిసి సోలంకి బకు తీశారు. అప్పటికే ్తని శరీరం ఉబ్బిపోయి తీవ్రంగా రక్తస్రావమైంది.

వెంటనే అత్యవసర విభాగానికి తరలించారు. అయితే, పది నిమిషాల వ్యవధిలో రాజేశ్ మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైద్యుడు సిద్దాంత్ షా, వార్డ్ బాయ్ విఠల్ చవాన్, వార్డు సహాయకురాలు సునీత సుర్వేపై కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి డీన్ డాక్టర్ రమేష్ భర్మాల్ చెప్పారు.

English summary
Rajesh Maru, died on Saturday evening after getting pulled into an MRI machine along with an oxygen cylinder he allegedly carried into the room for his ailing relative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X