ఆపరేషన్ జరుగుతుండగా గజల్స్ పాడిన రోగి.. అతని మనోధైర్యానికి హ్యాట్సాఫ్: వీడియో వైరల్ !!
సహజంగా ఆపరేషన్ అంటే ఎవరికైనా భయం ఉంటుంది. ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా అన్న ఆందోళన సైతం కనిపిస్తుంది. ఇక ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ దృష్టి పూర్తిగా ఆపరేషన్ ప్రాసెస్ మీద ఉంటుంది. గదిలో వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారుతుంది. అయితే అందుకు భిన్నంగా చక్కగా పేషెంట్ పాటలు పాడుతూ జరిగిన ఓ ఆపరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చత్తీస్ గడ్ రాయపూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటన లో శస్త్రచికిత్స గదిలో ఆపరేషన్ చేయించుకుంటున్న ఓ పేషెంట్ చక్కగా పాటలు పాడడం చోటు చేసుకుంది. వైద్యులు రోగులకు శస్త్రచికిత్స చేసినప్పుడు, వారు పూర్తిగా శస్త్రచికిత్స పైనే తమ ఏకాగ్రతను నిలుపుతారు. ఆపరేటింగ్ గది కూడా నిశ్శబ్దంగా కనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా చక్కగా ఆ రోగి గజల్ పాడాడు. శృతి శుద్ధంగా అతను గజల్ పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

శస్త్రచికిత్స గదిలో వైద్యులు రోగి యొక్క మెదడు నరాలకు ఆపరేషన్ చేస్తున్న క్రమంలో, రోగి తన మనస్సును ఎటువంటి ఆందోళనలపై దృష్టి పెట్టకుండా, మనసును వక్రీకరించకుండా కొన్ని పాటలు పాడుతూ కనిపించాడు. ఆపరేషన్ చేయించుకుంటున్న రోగిని పాటలు పాడమని వైద్యులు ప్రోత్సహిస్తున్న క్రమంలో అతను కొన్ని గజల్స్ పాడుతూ వైద్యులకు సహకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ వీడియో చూసిన వారంతా అతని ధైర్యాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఒకపక్క తల ఓపెన్ చేసి నరాలకు శస్త్ర చికిత్స చేస్తూ ఉంటే, మరోపక్క గుండె ధైర్యంతో ఆపరేషన్ చేయించుకుంటూ, పాటలు పాడుతున్న పేషెంట్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతని మనోధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. తనకు ఆపరేషన్ జరుగుతుంది అన్న విషయం మరిచిపోయి హుషారుగా పాటలు పాడిన సదరు రోగికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .












Click it and Unblock the Notifications