వీడెక్కడి మొగుడురా బాబూ.. భార్య డ్యాన్స్ చేస్తే చంపేసిండు..!
పాట్నా : పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేయడం కామన్. చిన్నా, పెద్దా చిందులు వేస్తూ.. వెడ్డింగ్ సెర్మనీలు ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఓ వివాహం సందర్భంగా.. భార్య డ్యాన్స్ చేసిందనే కారణంతో భర్త ఆమెను చంపేశాడు. బీహార్ లోని పాట్నా జిల్లా హసది ముషారి ఏరియాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
ఖోరంగ్ పూర్ గ్రామానికి చెందిన రంజిత్, మున్యా దేవి దంపతులు.. వారి సమీప బంధువుల వివాహానికి హసది ముషారి గ్రామానికి వచ్చారు. చాలాకాలం తర్వాత బంధువులంతా ఒక్క చోట కలవడంతో.. మున్యా దేవి తల్లి తరపు కుటుంబ సభ్యులు సంతోషంగా గడిపారు. అయితే సోమవారం నాడు రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. బంధువులతో కలిసి పోయిన మున్యా దేవి కూడా స్టెప్పులేశారు. అయితే ఆ ఆనంద సమయాన మున్యా దేవి భర్త కోపంతో చెలరేగి పోయాడు.

భార్య డ్యాన్స్ చూసి మురిసిపోవాల్సింది పోయి ఆగ్రహానికి గురయ్యాడు. అదే వేడుకలో భార్యను ఇష్టమొచ్చినట్లుగా చితకబాదాడు. బంధువులు చూస్తున్నారనే ధ్యాస కూడా లేకుండా వారి సమక్షంలోనే మున్యా దేవిని అతి దారుణంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా బయటకు లాక్కుంటూ వెళ్లి పక్కనే ఉన్న పశువుల కొట్టం లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. ఆమె స్పాట్‌లో చనిపోవడంతో.. భర్త అక్కడినుంచి పరారయ్యాడు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications