వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:ముందు ఆటో.. వెనకాల యువతి, ఫోన్ మాట్లాడుతూ వాక్.. మ్యాన్ హోల్‌లో పడి..

|
Google Oneindia TeluguNews

ఫోన్ ఉందా.. ప్రపంచమే మరచిపోతున్నారు. చుట్టు పక్కల చూడటమే లేదు. ఖాళీగా ఉన్నా సరే.. ఏదో అలా చూస్తూ ఉండిపోతారు. దీంతో పెద్దవారికి/ బంధువులకు కనీసం రెస్పెక్ట్ కూడా దక్కడం లేదు. పిల్లలు పెద్దలు అనే తేడా లేదు.. అందరికీ ఇదీ వర్తిస్తోంది. అలా జనాలు మొబైల్స్‌కు మోల్డ్ అయ్యారు. ఇలాంటి ఘటన ఒకటి పాట్నాలో జరిగింది. ఓ యువతి ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లి.. మ్యాన్ హోల్‌లో పడిపోయింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

 ప్రమాదాలు..

ప్రమాదాలు..


కొందరు అయితే ఫోన్ మాట్లాడుతూ మర్చిపోతున్నారు. తమ చుట్టూ ఏం జరిగినా పట్టించుకోరు. మరికొందరు రోడ్లపై ఫోన్ మాట్లాడుతూ ప్రమాదాలు కోరి తెచ్చుకుంటారు. ఓ మహిళ రోడ్డుపై ఫోన్ మాట్లాడుకుంటూ వస్తోంది. అయితే కిందకి చూడటం మరచిపోయింది. ఇంకెముంది ఆమె వెళ్లి మ్యాన్ హోల్‌లో పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు ఆమెను రక్షించారు. ఈ ఘటన పాట్నాలో జరిగింది.

ఆటో వెనకాల మహిళ

ఆటో వెనకాల మహిళ


మహిళ ఫోన్ మాట్లాడుతూ ఆటో వెనకాల వెళుతుంది. ఆటో మ్యాన్ హూల్ మీదుగా వెళ్లింది. అది చూసుకోకుండా ఆ మహిళా అలా వెళ్తుండగా సడెన్‌గా అందులో పడిపోయింది. 7 అడుగుల లోతు ఉన్న ఆ మ్యాన్‌హోల్ నుంచి స్థానికులు ఆమెను బయటికి తీశారు. ఆ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిని కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది. జనం ట్రోల్ చేస్తున్నారు.

పాట్నా యువతి ఇలా..


సో రహదారిపై నడిచే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ మాట్లాడాల్సి వస్తే చుట్టు పక్కల గమనించాలి. అంతా ఓకే అనుకుంటేనే నడవాలి.. లేదంటే ఇలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. పాట్నా యువతి స్వల్ప గాయాలతో బయట పడింది. ఆ సమయంలో జనం అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది.. లేదంటే ఇబ్బంది ఉండేది. ఎవరూ లేక.. సాయం చేసే వారు లేని స్థితి ఉండేది. సో రహదారిపై నడిచే సమయంలో మొబైల్ యూజ్ చేయకపోవడమే బెటర్.. ప్రమాదాలను కొని తెచ్చుకోకుండా ఉండటమే మంచిది.

English summary
a woman engrossed in a phone conversation fall into an open manhole. The clip has since gone viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X