పవన్ కళ్యాణ్ ప్రసంగం లైవ్ కవరేజ్ వేదికలు ఇవే

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారాల వీక్షణానికి వివిధ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. మొత్తం 28 ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో కూడా ఆ ఏర్పాటు జరిగింది. సీమాంధ్ర ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం లైవ్ కవరేజీకి ఏర్పాట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ రేపు శుక్రవారం సాయంత్రం తన రాజకీయ పార్టీ వివరాలను ప్రకటిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 45 నిమిషాల పాటు నడిచే ఈ మీడియా సమావేశం ప్రసంగాన్ని అభిమానులు ప్రజలు చూడవచ్చు.

Pawan kalayan's media live coverage areas
థియేటర్లలోనే కాకుండా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లలో కూడా ఆ ఏర్పాట్లు జరిగాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పేరు జనసేనగా ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తు, తదితరాలు ఖరారైనట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేసిన వేదికలు ఈ కింది విధంగా ఉన్నాయి.

హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో...

1. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ (మల్కాజిగిరి, సికింద్రాబాద్), 2. ఎంజెఎస్ ఫంక్షన్ హాల్ (కుత్బుల్లాపూర్), 3. శివసాయి ఫంక్షన్ హాల్ (మేడ్చెల్), 4. తిరుమల ఫంక్షన్ హాల్ (ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్), 5. వనస్థలిపురం పోలీసు స్టేషన్ వెనక గల మైదానం (ఎల్బీ నగర్), 6. హౌసింగ్ బోర్డు ఫంక్షన్ హాల్ (కూకట్‌పల్లి), 7. కెఎస్ ఫంక్షన్ హాల్ (బోరబండ)

ఆంధ్ర ప్రాంతంలో...

8. నాయుడు ఫంక్షన్ హాల్ (విజయనగరం), 9. ఆర్‌కె బీచ్, విశ్వప్రియ ఫంక్షన్ హాల్ (విశాఖపట్నం) 10. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ (కాకినాడ), 11. ఓల్డ్ అప్సర హోటల్ (రాజమండ్రి), 12. బస్ స్టాండ్ సెంటర్, మీరా గ్రంథాలయం (నర్సాపురం), 13. శ్రీనివాస థియేటర్ గ్రౌండ్, ఆర్ఆర్ పేట (ఏలూరు), 14. వాణి విద్యాలయం (విజయవాడ) 15. పిచిక గ్రౌండ్ (గుంటూరు), 16. గ్లోబల్ స్కూల్ (ఒంగోలు), 17. శివం ఫంక్షన్ హాల్ (నెల్లూరు)

రాయలసీమలో...

18. దేవేందర్ థియేటర్ (తిరుపతి), 19. రాజకళ్యాణ మండపం (కడప), 20. వెంకటేశ్వర రైస్ మిల్ కాంపౌండ్ ఏరియా (కర్నూలు), 21. లిటిల్ ఫ్లవర్ స్కూల్ గ్రౌండ్ (అనంతపురం)

తెలంగాణ ప్రాంతంలో..

22. సీక్వెల్ రిసార్ట్ (ఖమ్మం), 23. ఏకశిల పార్క్/ సుశీల్ థియేటర్ (వరంగల్), 24. కలెక్టర్ గ్రౌండ్ (నిజామాబాద్), 25. మురళీ థియేటర్ (జమ్మికుంట, కరీంనగర్ జిల్లా), 26. తిలక్ స్టేడియం (బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా), 27. విజన్ ఫంక్షన్ హాల్ (మహబూబ్‌నగర్).

28. హోటల్ సైటడెల్, మెజిస్టిక్ రోడ్డు (బెంగళూర్, కర్ణాటక)

<center><iframe width="100%" height="417" src="//www.youtube.com/embed/Lyi7JzTcW80" frameborder="0" allowfullscreen></iframe>)</center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+