MH Elections: మరాఠా గడ్డ నుంచి పవన్ మాస్ వార్నింగ్..!!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహాయుతి కూటమి అభ్యర్దును గెలిపించాలని పిలుపునిచ్చారు. బాలాసాహెబ్ ఠాక్రే.. దేశాన్ని రక్షించేందుకు ప్రతీ క్షణం తపించారని చెప్పుకొచ్చారు. శివసేన - జనసేన సనాతన హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి హెచ్చరికలు చేస్తున్నారని..వారికి భయపడేది లేదని పరోక్షంగా పవన్ ఓవైసీని హెచ్చరించారు.
బీజేపీ కూటమిని గెలిపించండి
జనసేనాని పవన్ కల్యాణ్ మహారాష్ట్రలోని డేగ్లూర్ బహిరంగ సభలో ప్రసంగించారు. మహాయుతి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. మహారాష్ట్ర సంస్కృతి, మరాఠి భాషను రక్షించుకోవాలంటే మహాయుతి కూటమి గెలపు అవసరమని చెప్పుకొచ్చారు. బాలా సాహెబ్ ఠాక్రే అయోధ్యలో రామాలయం గురించి పోరాటం చేసారని.. ప్రధాని మోదీ అయోధ్యలో రామాలయం సాకారం చేసారని గుర్తు చేసారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత జమ్ము కాశ్మీర్ లో శాంతి కనిపిస్తుందన్నారు. బీజేపీ హయాంలోనే మహారాష్ట్రకు భవిష్యత్ ఉందని చెప్పారు.

సనాతన ధర్మం కోసం
పవన్ తన ప్రచారంలో హిందీ, మరాఠీ భాషల్లో ప్రసంగించారు. మహాయుతి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. శివసేన - జనసేన అన్యాయం పై పోరాటం చేస్తాయన్నారు. ధర్మం కోసం రెండు పార్టీల సనాతన ధర్మాన్ని రక్షించటానికే ఉన్నాయన్నారు. అన్యాయం పై ఈ రెండు పార్టీలు పోరాటానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాయన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కారణంగానే ఇక్కడి దేవాలయాలు భద్రంగా ఉన్నాయని చెప్పారు. మనమంతా విడిపోయి బలహీనులుగా ఉందామా.. కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా అని ప్రశ్నించారు. ఇక్కడ ఏ ప్రాంతాల వారున్నా.. వారందరిలో సనాతన ధర్మమే నినాదంగా కనిపిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు.

సహనం పరీక్షంచవద్దు
మమాయుతికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని పవన్ కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మరాఠి సంస్కృతి కోసం, మరాఠి భాష కోసం ప్రజలంతా మహాయుతి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలో ఓవైసీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ నేల అని.. అలాంటి బెదిరింపులకు ఎవరూ భయపడరంటూ హెచ్చరించారు. సాధ్యమైనంత శాంతంగా ఉంటాం, బరిస్తాం, కానీ.. హద్దులు దాటితే మంచిది కాదని పవన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications