మలయాళ నటిపై లైంగిక దాడి: 'రేప్ తర్వాత షూటింగ్‌కు ఎలా వెళ్లింది?'

పోలీసులు చెబుతున్నట్లు లైంగిక దాడి జరిగి ఉంటే.. మరుసటి రోజు షూటింగ్‌కు ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు.

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మలయాళ నటిపై అత్యాచార ఘటన కేసులో దిలీప్ పాత్ర తేటతెల్లమైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కక్షతోనే ఆయన ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని విచారణలో స్పష్టమైంది.

అయితే జరిగిన ఘటనపై ఇంకా కొన్ని అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగాకేరళ ఎమ్మెల్యే జార్జి ఘటనపపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 'రేప్‌కు గురైన మహిళ మరుసటి రోజు షూటింగ్‌కు ఎలా హాజరైంది' అంటూ ఆయన ప్రశ్నించారు.

pc george feels assualt survivor is lying since she went to work

కేసులో నటుడు దిలీప్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న జార్జి బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. 'పోలీసులు కోర్టులో చెప్పినట్లు ఆ నటిపై దారుణంగా అత్యాచారం జరిగి ఉంటే, ఆమె మరుసటి రోజు షూటింగ్‌కు ఎలా వెళ్లగలిగింది' అని అడిగారు.

దిలీప్ కు మద్దతు తెలిపిన జార్జి.. కుట్రకు అతను బలయ్యాడని పేర్కొన్నారు. జార్జి వ్యాఖ్యలపై మలయాళ సినీ రంగానికి చెందిన మహిళలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే అయి ఉండి ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేరళ స్పీకర్‌ను వారు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+