షాకింగ్: కేంద్ర మంత్రి కొట్టబోయాడు -రాజ్యసభలో Pegasusరచ్చపై టీఎంసీ ఆరోపణ -ప్రవిలేజ్ మోషన్

రాజకీయ, మీడియా ప్రముఖులపై కేంద్రం నిఘాకు పాల్పడిందనే పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై రాజకీయ దుమారం తారాస్థాయికి చేరింది. కేంద్రం స్పైవేర్ వాడినట్లు ఆధారాలు లేవని, ఆ మేరకు వచ్చిన కథనాలు అవాస్తవాలంటూ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటన చేస్తున్న సమయంలో అసాధారణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. మంత్రి చేతిలో నుంచి పేపర్లు లాక్కొని చింపేసిన టీఎంసీ ఎంపీలు.. ఆ కాగితం ముక్కల్ని రాజ్యసభాపతి సీటుపైకి విసిరేశారు. అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని కేంద్రం భావిస్తుండగా, అటు నుంచి అనూహ్య వాదనలు తెరపైకొచ్చాయి..

పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన, టీఎంసీ ఎంపీల రచ్చ, మార్షల్స్ రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కూడా సభలో హైడ్రామా కొనసాగిందని టీఎంసీ ఎంపీ శాంతను సేన్ చెప్పారు. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి గురువారం రాజ్యసభలో తనపై దాడి చేయబోయారని, సహచర ఎంపీలు తనను కాపాడారని శాంతను ఆరోపించారు. సభ వాయిదా పడిన తర్వాత హర్దీప్‌ సింగ్‌ తనను బెదిరించడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడారని, దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. మరోవైపు,

Pegasus row: Hardeep Puri about to physically assault me, says TMCs Shantanu, privilege motion

రాజ్య‌స‌భ‌లో గురువారం గంద‌ర‌గోళం సృష్టించిన టీఎంసీ ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా ప్రివిలేజ్ మోషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నది. కేంద్ర మంత్రి చేతిలో నుంచి పేపర్లు లాక్కొని, చింపేసిన టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ను సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెగాస‌స్ స్పైవేర్ అంశంపై రాజ్యసభలో ప్రకటన చేస్తున్న కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ పట్ల టీఎంసీ ఎంపీలు గురువారం అనుచితంగా వ్య‌వ‌హ‌రించారు. పేపర్లు చింపిన సమయంలో కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్, టీఎంసీ ఎంపీ సేన్ మధ్య వాగ్వాదం జరిగింది.

Pegasus row: Hardeep Puri about to physically assault me, says TMCs Shantanu, privilege motion

పెగాసస్ స్సైవేర్ ఉదంతంపై పార్లమెంటులో టీఎంసీ ఎంపీలు రచ్చకు దిగగా, ఆ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ, తన సమావేశాలపై కేంద్రం నిఘా పెట్టిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 'ఖేలా హోబే' నినాదంతో ఢిల్లీకి వెళుతున్నట్లు మమత ప్రకటించిన తర్వాత పార్లమెంటులో టీఎంసీ ఎంపీలు దూకుడు పెంచారు. వచ్చేవారమే దీదీ ఢిల్లీలో పర్యటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+