పెహ్లూఖాన్ దాడికేసులో ఆరుగురు నిర్దోషులే : తీర్పు వెలువరించిన రాజస్థాన్ కోర్టు
జైపూర్ : రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెహ్లు ఖాన్ దాడి కేసులో రాజస్థాన్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులు ఆరుగురు నిర్దోషులని తీర్పులో పేర్కొన్నది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 7న ముగిసిన సంగతి తెలిసిందే. తీర్పును ఇవాళ్టికి వాయిదావేసిన న్యాయస్థానం కాసేపటి క్రితం తుది తీర్పును వెల్లడించారు. జిల్లా అడిషనల్ జడ్జ్ జస్టిస్ సరితా స్వామి పెహ్లూ ఖాని దాడి కేసుకు సంబంధించి తీర్పును వెలువరించారు.
ఏం జరిగిందంటే ..
2017 ఏప్రిల్ 1న పెహ్లు ఖాన్ .. తన ఇద్దరు కుమారులు, మరో నలుగురితో కలిసి జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే వారు గోవులను అక్రమంగా సరఫరా చేస్తున్నారని కొందరు అడ్డగించారు. వారి వాహనాన్ని ఆపి విచక్షణరహితంగా కొట్టారు. దీంతో పెహ్లూ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని అల్వార్ ఆస్పత్రికి తరలించారు. మూడురోజుల తర్వాత దాడికి సంబంధించిన విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులకు పోలీసులు క్లీన్ చీట్ ఇవ్వడం కలకలం రేపింది. కానీ వీడియో వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు.

ఆరుగురు నిర్దోషులే
తొలుత ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వారిపై పోలీసులు చార్జీషీట్ ఫైల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ అల్వార్ కోర్టులో జరిగింది. అయితే కోర్టుకు సాక్ష్యాధారంగా వీడియోను అందజేశారు. అయితే దానిని కోర్టు స్వీకరించలేదు. దీంతో రాజస్థాన్ కోర్టు కేసు వెళ్లింది. అక్కడ పెహ్లు ఖాన్ తరఫున వాదనలు, నిందితుల పక్షాన వాదనలు జరిగాయి.












Click it and Unblock the Notifications