బెంగళూరులో ప్రజలను మడత పెడుతున్న భారీ వానలు, రాత్రి అయితే రామయణం !
బెంగళూరు: బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడింది. బెంగళూరులో ఇంకా మూడు రోజుల పాటు పలు చోట్ల విపరీతమైన వానలు అపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరులో మంగళవారం సాయంత్రం నుంచి అర్దరాత్రి దాటే వరకు కురిసిన వానలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
సిలికాన్ సిటీ బెంగళూరులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వానల కారణంగా పలు ప్రాంతాల్లోని మురికివాడలు జలమయం అయ్యాయి. రోడ్ల మీద వర్షం నీరు పేరుకుపోయి వాహన సంచారానికి ఆటంకం ఎదురైయ్యింది. బైక్ ల్లో సంచరించే వారు రోడ్డ మీద వాహనాలు నిలిచిపోవడంతో నానా తిప్పలుపడ్డారు. నీళ్లల్లో బైక్ లు తోసుకని వెళ్లలేక ఇబ్బందులకు గురైనారు.

బెంగళూరు నగరంలోని కేఆర్ పురం, జయనగర, బీటీఎం లేఔట్, సిల్క్ బోర్డు, తిలక్ నగర్, మెజస్టిక్, మార్కెట్, మహదేవపుర, మారతహళ్లి, వైట్ ఫీల్డ్, ఐటీపీఎల్, బాగ్ మనే తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి విపరీతమైన వానలు పడ్డాయి. మంగళవారం రాత్రి కురిసిన వర్షాల కారణంగా బుధవారం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారు ఇబ్బందులకు ఎదుర్కొన్నారు.
భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం రాత్రి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ కావడంతో కార్యాలయాల నుంచి, పనులు పూర్తి చేసుకుని ఇళ్లుకు, గమ్యం చేరుకోవడానికి బయలుదేరిన ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

బెంగళూరులో ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. బెంగళూరు సిటీతో పాటు బెంగళూరు గ్రామీణ, తుమకూరు, మైసూరు, చామరాజనగర, రామనగర, చెన్నపట్టణ, కోలారు. చిక్కబళ్లాపుర, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications