వరదలు: ప్రాణాలకు తెగించి రక్షించారు (వీడియో)
చెన్నై: చెన్నై నగరంలో వరదలు, భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు మీద బైక్ లో వెలుతున్న ఓ వ్యక్తి ఒక్క సారిగా వరద నీరు దూసుకురావడంతో అదుపుతప్పి జారి పడిపోయాడు.
అటు వైపు వెళుతున్న స్థానికులు పరుగున వెళ్లి ప్రాణాలకు తెగించి అతనిని రక్షించడానికి ప్రయత్నించారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని దాదాపు రెండు నిమిషాల పాటు శ్రమించి అతని ప్రాణాలు రక్షించారు.

రోడ్ల మీద భారీగా నీరు పొర్లుతుండటంతో వాహనాలు సైతం అదుపుతప్పి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముందు జాగ్రత చర్యగా రిజర్వాయర్లు ఉన్న పరిసర ప్రాంతాల రహదారులను అధికారులు ఇప్పటికే మూసివేశారు.












Click it and Unblock the Notifications