ముగ్గురు పిల్లలను కనాలి: అది ప్రమాదమంటూ మోహన్ భగవత్ ఆందోళన
దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గుతుండటంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోయే ప్రమాదం ఉందని అన్నారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కుటుంబ ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.
కుటుంబాలు సమాజంలో భాగమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. జనాభా తగ్గుదల అనేది ఆందోళనకర అంశం. జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 కన్నా దిగువకు వెళితే.. సమాజం దానికదే నశించి ప్రమాదం ఉంది. దాన్ని ఎవరూ అంతం చేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యతో ఇప్పటికే అనేక భాషలు, సంస్కృతులు కనుమరుగయ్యాయి అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

భారత జనాభా విధానం కూడా ఈ రేటు 2.1 కన్నా తక్కువ ఉండకూడదని చెబుతోంది. మన దేశానికి సంబంధించి ఇది కనీసం మూడుగా ఉండాలి. ఈ సంఖ్య చాలా కీలకం. ఎందుకంటే సమాజ మనుగడ అది అవసరం అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. సమాజ మనుగడ కోసం కనీసం ముగ్గురు పిల్లలు కనాలని ఆయన అన్నారు.
కాగా, 1960-2000 మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రతి మహిళ 2.1 మందిని కంటేనే పాతతరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు. 2.1కి దరిదాపుల్లో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీషియా ఉన్నాయి.
ఇక, 2.1 కన్నా తక్కువ రేటు ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సోకోలు ఉండగా.. చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో అంతకన్నా తక్కువ రేటు ఉండటం గమనార్హం. ప్రపంచంలో జనాభా సహజంగా తగ్గిపోయే పరిస్థితులు ప్రమాదకరమన్నారు ప్రొఫెసర్ క్రిష్టోఫర్ ముర్రే. జనాభా అధిక శాతంతో తగ్గిపోవడమనేది ఊహించడానికి కష్టం. జనసమూహాలను వెతుక్కునే పరిస్థితి ఏర్పడవచ్చని ముర్రే ఆందోళన వ్యక్తం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications