వారం రోజులుగా శివుడి చుట్టూ శునకం ప్రదక్షిణలు
లక్నో: గత ఆరు రోజులుగా ఓ కుక్క శివలింగం చుట్టూ ఆగకుండా ప్రదక్షిణలు చేస్తున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లా మౌరానీపూర్‌లో చోటు చేసుకుంది. ప్రముఖ మహాకాళేశ్వర ఆలయంలో కుక్క గత ఆరు రోజులుగా శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం భక్తులను ఆకట్టుకుంటోంది.
దీంతో భక్తులంతా దానికి కూడా పూజలు చేస్తున్నారు. ఈ విషయమై ఆ గుడి అర్చకుడు మాట్లాడుతూ.. ఈ శునకం పేరు కాలూ అని, గత మంగళవారం నుంచి అది ఈశ్వరుని చూట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉందని చెప్పారు. దీంతో దానికి ఆయన సేవకురాలిగా పదవిని సైతం కల్పించామని చెప్పారు.

ఈశ్వరుడి దర్శనం కోసమే కాకుండా ఇప్పుడీ శునకాన్ని చూడటానికి కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆయన చెప్పారు. కాగా, గతంలో ఇలాంటి సంఘటనలు మనం పలుమార్లు విన్న విషయం తెలిసిందే. రామ చిలుకలు, పాములు, కోతులు దేవుళ్ల చుట్టూ తిరగడం, దేవుడిని పూజించడం విన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications