ఐటీ హబ్ లో అరాచకం, ఒకేసారి 7 కుక్కలను చంపేసి ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి ?
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మూగజీవాలపై మనుషుల అకృత్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్- హోసకరెహళ్లి మధ్య నిర్మానుష్య ప్రాంతంలో సంచిలో ఏడు వీధికుక్కల మృత దేహాలు ఒకేసారి లభ్యం కావడంతో స్థానికులు హడలిపోయారు.
గుర్తు తెలియని వ్యక్తులు వీది కుక్కలను చంపి వాటి మృతదేహాలను సంచిలో నింపి నిర్జన ప్రాంతంలో పడేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రాజరాజేశ్వరినగర్‌కు చెందిన వన్యప్రాణుల సంరక్షణ చూస్తున్న లీనా అనే మహిళ ఫిర్యాదు మేరకు రాజరాజేశ్వరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

వీది కుక్కల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నివేదిక వచ్చిన తర్వాతే వీది కుక్కల మృతికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. దుండగులు వీధికుక్కలకు విషపూరితమైన ఆహారం తినిపించి చంపి సంచిలో నింపి నిర్జన ప్రాంతంలో పడేసి ఉంటారని చెబుతున్నారు. రాజరాజేశ్వరి నగర్‌లో గత వారం రోజులుగా 18 వీధికుక్కలు అదృశ్యమైనట్లు జంతు సంరక్షణ బృందం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
అయితే వీది కుక్కల కారణంగా ఆ ప్రాంతంలోని చిన్నారులు, ముసలాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమయంలో ఈ స్వచ్చంద సంస్థల నిర్వహకులు ఏం చేస్తున్నారని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో ఓ బృందం సభ్యులు నిర్జన ప్రాంతంలో ఏడు కుక్కల మృతదేహాలను గుర్తించారు. ఐదు కుక్కల మృతదేహాలు దాదాపుగా కుళ్లిపోయినట్లు గుర్తించారు. మూగ జంతువులపై జరిగిన క్రూరత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని వాళ్లు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications