Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేనేం చేసినా తప్పుగానే కనిపిస్తుంది: అమీర్ ఖాన్

ముంబై: తన పైన వ్యతిరేకత ఉన్న వాళ్లు తాను ఏం చేసినా తప్పుపడతారని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సోమవారం నాడు చెప్పారు. గత ఏడాది అసహనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయనను చాలామంది తిట్టిపోశారు.

ఈ నేపథ్యంలో ఆయన పరోక్షంగా అసహనంపై తాజాగా స్పందించారు. తన పట్ల వ్యతిరేక భావం ఉన్న వాళ్లు తాను ఏం మాట్లాడినా ప్రశ్నిస్తారన్నారు. సినిమాల ద్వారా దాదాపు ఇరవై ఏడేళ్లుగా అభిమానులతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తానేమిటో వారందరికీ తెలుసన్నారు.

People who question me are biased against me: Aamir Khan on Intolerance

ఎవరైతే తనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారో వారంతా తనపై వ్యతిరేక భావాన్ని ముందుగానే ఏర్పరుచుకున్న వారే అన్నారు. అలాంటి వారికి నేను ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందన్నారు. తన దృష్టిలో దేశంపై గౌరవం అంటే సమాజానికి సేవ చేయడమన్నారు. తనకు గానీ, తన భార్యకు గానీ దేశం విడిచి వెళ్లే ఉద్దేశం లేదన్నారు.

అదే సమయంలో సల్మాన్ ఖాన్ పెళ్లి పైన సరదాగా వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోమని ఎప్పుడైనా చెప్పారా అని విలేకరులు అమీర్ ఖాన్‌ను ప్రశ్నించారు. దానికి అమీర్ ఖాన్ స్పందిస్తూ.. తాను నిజంగా ప్రయత్నాలు చేయలేదని, అయితే సూచన మాత్రం చేశానని, నేను కచ్చితంగా ఒత్తిడి చేస్తే సక్సెస్ అవుతానేమో అని అభిప్రాయపడ్డారు. సల్మాన్‌ను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+