Peoples Pulse ఎగ్జిట్ పోల్స్: జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీ హవా, బీజేపీకి షాక్
జమ్మూకాశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు నేటితో ముగియడంతో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. అక్టోబర్ 8న అసలు ఫలితాలు తేలనున్నప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా, పలు సర్వేలు ఫలితాలు విడుదల చేస్తున్నాయి.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలోని 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. మెజార్టీ స్థానాలను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సాధించగా.. రెండోస్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచాయి. పీడీపీ నాలుగో స్థానానికే పరిమితమైంది.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా లప్రకారం.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NC)కి 33-35 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ 23-27, కాంగ్రెస్ పార్టీ 13-15, పీడీపీ 7-11, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో ఎన్సీతో కలిసి కాంగ్రెస్ జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే జమ్మూ కాశ్మీర్ లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫిరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్లోని మొత్తం 90 సీట్లకు గానూ, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, జేకేపీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. ఇక, జేకేఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, జేకేపీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం ఓట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. కలిసి పోటీ చేసిన జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అక్టోబర్ 8న అసలైన ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయో ఆరోజే తేలనుంది.












Click it and Unblock the Notifications