వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం రేపుతోన్న డిజైనర్ హత్య : కాళ్లు చేతులు కట్టేసి..

|
Google Oneindia TeluguNews

పుణే : గోవాలో ప్రముఖ పర్ఫ్యూమ్ డిజైనర్ మోనికా గర్డే అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. ఇంట్లో చోరికి యత్నించిన దొంగలు.. ఆమెను రేప్ చేసి హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయి. మోనికా చనిపోయిన విషయాన్ని ఆమె ఇంటిపక్కన ఉన్నవాళ్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మోనికా హత్యను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోకి దోపిడి చేయడానికి వచ్చిన దొంగలే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసుంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మోనికా కాళ్లు చేతులు కట్టేసి ఉండడం, మృతదేహం నగ్నంగా ఉండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.

Perfumer Monika Ghurde found dead with hands and legs tied in her Goa home

కాగా, 39ఏళ్ల గర్డే ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం పర్ఫ్యూమ్ డిజైనర్ గా, పరిశోధకురాలిగా పనిచేస్తోంది. గురువారం నాడు మోనికా సోదరుడు ఆమెకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ.. మోనికా అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన సోదరుడు ఇంటిపక్కన వారికి సమాచారం అందించాడు. వారి వద్ద ఉన్న మరో అదనపు తాళంతో ఇంటి తలుపు తెరిచి చూడగా ఇంట్లో విగత జీవిగా కనిపించింది మోనికా. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

English summary
Well-known Indian perfume designer Monika Ghurde was found dead in her house in Goa's Sangolda area on Friday morning. An investigation was initiated after the police discovered her naked body with her hands and legs tied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X