సిద్దరామయ్య, ఆజాద్ విమానానికి అనుమతి నిరాకరణ, గంటకు పైగా ఫ్లైట్‌లోనే
బెంగుళూరు:కర్ణాటక నుండి హైద్రాబాద్ కు ప్రత్యేక విమానంలో రావాల్సిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు హైద్రాబాద్ కు తరలివచ్చేందుకు ఏర్పాటు చేసుకొన్న విమానానికి కర్ణాటక విమానాశ్రయంలో గంటపాటు అనుమతిని నిలిపివేశారు. అయితే చివరకు అనుమతి లభించడంతో ఆ విమానంలోనే సిద్దరామయ్య, ఆజాద్ హైద్రాబాద్ కు చేరుకొన్నారు.
కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు కేరళలోని రిసార్ట్స్ కు వెళ్ళాల్సి ఉన్న సమయంలో కూడ రెండు ప్రత్యేక విమానాలకు మే 17వ తేది రాత్రి అనుమతి లభించలేదు. దీంతో ఈ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు శర్మ ట్రావెల్స్ బస్సుల్లో హైద్రాబాద్ కు వచ్చారు.
అయితే హైద్రాబాద్ లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి సిద్దరామయ్య,.ఆజాద్ వచ్చేందుకు ప్రత్యేక విమానంలో కూర్చొన్న గంటసేపటి వరకు కూడ టేకాఫ్ అయ్యేందుకు డిజీసీఏ నుండి అనుమతి లభించలేదు. సుమారు గంటకు పైగా విమానంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు కూర్చొన్నారు. దీంతో ఆలస్యంగా సిద్దరామయ్య, ఆజాద్ హైద్రాబాద్ కు వచ్చారు.

మే 17వ తేది రాత్రి కూడ కెంపెగౌడ విమానాశ్రయంలో ఇలానే జరిగింది. ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను కేరళలో తరలించాలనుకొన్నా డీజీసీఏ నుండి అనుమతి లభించని కారణంగా బస్సుల్లో ఎమ్మెల్యేలు బస్సుల్లో హైదరాబాద్‌కు వచ్చారు .
మే 19వ తేదిన జరిగే బల పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సమావేశంలో కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు వ్యూహరచన చేస్తున్నారు. విశ్వాస పరీక్షల్లో బిజెపి అనుసరించే విధానాలను చిత్తు చేసి విజయం సాధించాలని ఈ కూటమి భావిస్తోంది. అయితే ఏం జరుగుతోందో కొన్ని గంటల్లో తేలనున్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications