పాక్ ప్రధాని ఆతిథ్యం అద్భుతం: మోడీ ట్వీట్స్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరిఫ్ సాహెబ్ నాకు పలికిన ఆహ్వానం, చేసిన మర్యాదలు మనసుకు హత్తుకున్నాయని భారత ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆయనే నాకు స్వయంగా స్వాగతం పలికారని చెప్పిన మోడీ, తిరిగి వెళ్లేటప్పుడు స్వయంగా వీడ్కోలు పలికారని తెలిపారు.
తన పాకిస్థాన్ ఆకస్మిక పర్యటన ప్రధాని నవాజ్ షరిఫ్ కుటుంబ సభ్యులతో ఆహ్నాదకరంగా గడిచిందన్నారు. అంతేకాదు బీజేపీ అగ్రనేత వాజపేయి పట్ల తనకున్న అభిమానాన్ని ఆయన నాతో పంచుకున్నారన్నారు.

అటల్‌జీతో తన సమావేశాన్ని, జరిపిన సంభాషణలను గుర్తుకు తెచ్చుకున్నారు. నవాజ్ సాహెబ్ పుట్టినరోజు, ఆయన మనవరాలి వివాహం... రెండింటితో తన పర్యటన ద్విగుణీకృతమయ్యాయని మోడీ ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు. లాహోర్ శివారులోని రాయ్ విండ్ లోని నవాజ్ సొంతింటికి వెళ్లిన మోడీ, ఆయన మనవరాలి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగానే రాయ్ విండ్‌లో మోడీ గడిపారు.
Am personally touched by Nawaz Sharif Sahab 's gesture of welcoming me at Lahore airport and coming to the airport when I left.
— Narendra Modi (@narendramodi) December 25, 2015 Nawaz Sharif Sahab's affection towards Atal ji is very touching. He recalled their interactions & asked me to convey his regards to Atal ji.
— Narendra Modi (@narendramodi) December 25, 2015 Spent a warm evening with Sharif family at their family home. Nawaz Sahab's birthday & granddaughter's marriage made it a double celebration
— Narendra Modi (@narendramodi) December 25, 2015 Spent a warm evening with Sharif family at their family home. Nawaz Sahab's birthday & granddaughter's marriage made it a double celebration
— Narendra Modi (@narendramodi) December 25, 2015 తెలుగు వన్ఇండియా












Click it and Unblock the Notifications