యజమానిని కాపాడేందుకు తన ప్రాణం అడ్డేసిన కుక్క!
ట్యుటికోరిన్ : కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు. యజమాని ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను బలివ్వడానికైనా సిద్ధమవుతుంది. ఇది నిజం చేసింది తమిళనాడులోని ఓ శునకం.
వివరాల్లోకి వెళితే.. ట్యుటికోరిన్ పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో పొమెరానియన్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నది. కాగా, గురువారం రాత్రి ఇంట్లోకి దూరిన తాచుపాము.. సదరు మహిళను కాటేయడానికి ప్రయత్నించింది.

దీన్ని గమనించిన పెంపుడు కుక్క.. వెంటనే పాముపైకి దూకింది. నోటితో పామును ముక్కలు ముక్కలు చేసి చంపింది. పాము కాటువేయడంతో కుక్క కూడా అక్కడే కుప్పకూలిపోయింది.
దీంతో యజమానురాలు వెంటనే పశువైద్యశాలకు శునకాన్ని తరలించగా చనిపోయింది. తన యజమాని కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ శునకాన్ని చూసి ఆ యజమాని, స్థానికులు చలించిపోయారు.












Click it and Unblock the Notifications