Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పౌరసత్వం కేసులో రాహుల్‌కు రిలీఫ్... పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్..

Recommended Video

    పౌరసత్వం కేసులో రాహుల్‌కు రిలీఫ్... పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్ || Oneindia Telugu

    ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి రిలీఫ్ దొరికింది. ఆయన పౌరసత్వంపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటీషనర్లు కోర్టుకు సమర్పించిన పత్రాలపై అనుమానం వ్యక్తం చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం వాటికున్న ప్రమాణికత ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఒక కంపెనీ తన డాక్యుమెంట్లలో రాహుల్‌ను బ్రిటీష్ పౌరుడని రాసినంత మాత్రాన ఆయన బ్రిటన్ పౌరుడైపోతాడా అని ధర్మాసనం ప్రశ్నించింది.

    రాహుల్‌ గాంధీ బ్రిటన్ పౌరుడని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఊహాగానాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.పౌరసత్వంపై నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జై భగవాన్ గోయెల్, చందర్ ప్రకాశ్ త్యాగీలు పిటీషన్ దాఖలు చేశారు. పౌరసత్వంపై స్పష్టత వచ్చాకే రాహుల్‌ను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించాలని కోరారు. పౌరసత్వ ఆరోపణలకు సంబంధించి పిటీషనర్లు బ్రిటన్ కంపెనీకి చెందిన కొన్ని డాక్యుమెంట్లను సమర్పించారు.

    Petition about Rahul Gandhis Citizenship Dismissed By Supreme court

    బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంపై స్పందించింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పౌరసత్వంపై 2015లోనూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ అమిత్ రావ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటీషన్‌ను తోసిపుచ్చింది. ఒక వ్యక్తి లేదా సంస్థను లక్ష్యంగా చేసుకుని పిల్ దాఖలు చేయరాదని స్పష్టం చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+