రూ.110 దాటినా వదలట్లే..మళ్లీ పెట్రో రేట్ల వాతే: సౌత్ సిటీస్ పరిపూర్ణం: బైక్ కాదు బైసైకిల్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మళ్లీ..మళ్లీ కొరడా ఝుళిపిస్తూనే వస్తోన్నాయి. రెండు రోజుల స్వల్ప విరామం అనంతరం తాజాగా ఇంధన రేట్లను పెంచేశాయి. మే 4వ తేదీ నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఇది 33వ సారి. రెండు నెలల్లో సగం రోజులకు పైగా వాటి రేట్లను చమురు సంస్థలు పెంచినట్టయింది. పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువ అవుతోంది. పలు చోట్ల డీజిల్ కూడా 100 రూపాయల మార్క్‌ను దాటేసింది. దక్షిణాదిన అన్ని మెట్రో సిటీల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను దాటింది.. చెన్నై సహా.
పెట్రోల్, డీజిల్‌పై ఎంత పెరిగిందంటే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 35 పైసల మేర పెరిగింది.. తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.99.16, డీజిల్ 89.18 పైసలకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 105 మార్క్‌ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.105.24 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 96.72కు చేరింది. తాజా పెంపుతో చెన్నై కూడా వంద రూపాయల క్లబ్‌లో చేరింది. అక్కడ పెట్రోల్ రూ.100.13, డీజిల్ ధర రూ.93.72లుగా నమోదైంది. దీనితో దక్షిణాది రాష్ట్రాల అన్ని రాజధానుల్లో పెట్రోల్ 100 రూపాయలను దాటినట్టయింది.
This is how modi and petrol feels today in chennai #Chennai #tnlockdown #PetrolDieselPriceHike #PetrolPriceHike #Petrol100NotOut #ModiMadeDisaster #4yearsofGST pic.twitter.com/5Vw3eoWG4k
— Janaak G (JanaakVIRUS) July 2, 2021
హైదరాబాద్‌లో 103కు పైగా..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయలను దాటేసింది. తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి హైదరాబాద్‌లో రూ.103.05 పైసలుగా రికార్డు కాగా.. డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.97.20 పైసలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయల లోపు ఉన్న జిల్లా లేకపోవచ్చు. కోల్‌కతలో పెట్రోల్ రూ.99.07 పైసలు, డీజిల్ ధర రూ.92.03 పైసలకు చేరింది. భోపాల్‌లో పెట్రోల్-107.43, డీజిల్-97.93, బెంగళూరులో పెట్రోల్ రూ.102.48, డీజిల్ 94.54, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.101.14, డీజిల్ రూ.95.74 పైసలు, పాట్నాలో పెట్రోల్ రూ.101.21 పైసలు, డీజిల్ రూ.94.52 పైసలుగా ఉంది.
అక్కడ రూ.110కి పైగా
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోలు రేట్లు రికార్డులను బద్దలు కొడుతోంది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఈ పట్టణంలో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయల మార్క్‌ను అధిగమించింది. అక్కడ 110.40 పైసలకు చేరింది. ఇక డీజిల్ కూడా అదే వైపు పరుగులు పెడుతోంది. 102.42 పైసలుగా దాని రేటు నమోదైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో శ్రీగంగానగర్ టాప్‌లో ఉంది. నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది.

Click it and Unblock the Notifications