పెట్రోల్ మరింత భారం కానుందా?
ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతోంది. బ్యారెల్ ఒక్కింటికి 80- 90 డాలర్ల మధ్య ఉంటోంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 87.99 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ రేట్ ఇంకా తక్కువగా నమోదైంది. 82.67 డాలర్ల వద్ద ట్రేడింగ్ రికార్డయింది. సోమవారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది.
ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. క్రూడాయిల్ బ్యారెట్ రేట్ పెరుగుదల బాట పట్టిన నేపథ్యంలో ఇంధన ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పెట్రోల్ రేట్‌ను పెంచే ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా చమురు కంపెనీలు జారీ చేసిన రేట్ల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.35 పైసలుగా నమోదైంది. ఇక్కడ డీజిల్ ధర 94.28 పైసలు. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది.
చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, విజయవాడలో పెట్రోల్ రూ. 111.50 పైసలు, డీజిల్ రూ. 99.27పైసలుగా నమోదైంది. పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
నొయిడాలో పెట్రోల్ రూ.96.79 పైసలు, డీజిల్ రూ.89.96 పైసలుగా రికార్డయింది. గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.97.18 పైసలు, డీజిల్-90.05 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్-98.20 పైసలు, డీజిల్ 84.26 పైసలు పలుకుతోంది. రవాణా ఖర్చులను కలుపుకొంటే ఆయా నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications