బిజెపి కార్యాలయంపై పెట్రో బాంబు దాడి
కేరళలో బిజెపి కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
తిరువనంతపురం: కేరళలో బిజెపి కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
పెట్రో బాంబు దాడి కారణంగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ చైర్లు, కొంత ఇతర సామాగ్రి దగ్ధమైంది. కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

పెట్రో బాంబు దాడి నేపథ్యంలో బిజెపి త్రివేండ్రంలో గురువారం ఆందోళనకు పిలుపునిచ్చింది. కాగా, కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ బిజెపి కార్యకర్తలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications