• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైరల్ : పెట్రోల్ బంక్ లో చోరీ.. కత్తితో దోపిడి దొంగల వీరంగం

|

చెన్నై : తమిళనాడులో జరిగిన దోపిడీ ఘటన వైరల్ గా మారింది. పెట్రోల్ బంక్ లో కత్తితో వీరంగం సృష్టించారు దొంగలు. కడలూరు - చిదంబరం రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పెట్రోల్ కోసం బైక్ మీద వచ్చిన ముగ్గురు వ్యక్తులు చోరీకి తెగబడ్డారు. బైకును నడుపుతున్నవాడు పెట్రోల్ పోసే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటించాడు. అంతలోనే వెనుక కూర్చున్నోడు ఆ వ్యక్తి నుంచి క్యాష్ బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేయడంతో అతడు తిరగబడ్డాడు. దీంతో కత్తి తీసి బెదిరించాడు.

petrol bunk robbery in chennai

అయినా ఆ వ్యక్తి ప్రతిఘటించడంతో కిరాతకంగా కత్తితో నరికాడు. అయినా కూడా అతడు క్యాష్ బ్యాగ్ వదల్లేదు. దీంతో రెచ్చిపోయిన దుండగుడు కోపంతో విచక్షణారహితంగా పలుమార్లు వేటు వేశాడు. పెట్రోల్ బంక్ కు చెందిన మరో ఉద్యోగి ఇదంతా చూస్తూ కూడా ప్రతిఘటించలేదు.. పైగా అక్కడినుంచి పారిపోయాడు. సీసీటీవి దృశ్యాల ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

English summary
The plundering incident in Tamil Nadu has become viral. In the petrol bunk, thieves were created nonsense with a knife. They turned away from the petrol pump, trying to get the cash bag. They attacked with knife many times while he refused to give cash bag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X