మందుబాబులకు బిగ్ షాక్: బాటిల్‌పై రూ.40 వరకు పెంపు: పెట్రోల్, డీజిల్ పైనా భారం: కొత్త సెస్
ప్రభుత్వం సామాజిక భద్రత సెస్ ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు బడ్జెట్ లో ప్రతిపాదనలను చేసింది. ఈ సెస్ కింద పెట్రోల్, డీజిల్ పై రూ.2, మద్యంపై రూ.20 మేర పెంచినట్లు ప్రకటించింది.
తిరువనంతపురం: సరిగ్గా రెండు రోజుల కిందటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు. చాలాకాలం నుంచి వినిపిస్తోన్న పలు డిమాండ్లను ఆమె పరిశీలనలోకి తీసుకోలేదు. అందులో ప్రధానమైనవి- మద్యం, పెట్రోల్, డీజిల్. వాటిని వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకుని రావాలనే డిమాండ్ ఉన్నప్పటికీ- అనుకూలంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇక- ఈ డిమాండ్ పై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
కేరళ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రెండింటి రేట్లను భారీగా పెంచింది. ఈ మేరకు బడ్జెట్ లో ప్రతిపాదనలను చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కొద్దిసేపటి కిందటే ఆర్థిక శాఖ మంత్రి కేఎన్ బాలగోపాల్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతిపాదించిన అంశాల గురించి సమగ్రంగా సభకు వివరించారు. పెట్రోల్, డీజిల్, మద్యం రేట్లను ఎందుకు పెంచాల్సి వచ్చిందనే విషయంపై స్పష్టత ఇచ్చారు.

పెట్రోల్, డీజిల్ అమ్మకాలను లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచాలని ప్రతిపాదించినట్లు బాలగోపాల్ తెలిపారు. ప్రతి సంవత్సరం కనీసం 2,000 కోట్ల రూపాయలను అదనంగా ఆర్జించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణ పరిస్థితులను అరికట్టడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించేలా ప్రత్యేక చర్యలను తీసుకోవడానికి ఈ మొత్తాన్ని బదలాయించాలని ప్రతిపాదించామని అన్నారు.
మద్యం రేట్లను కూడా భారీగా పెంచినట్లు ప్రకటించారాయన. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అమ్మకాలపై వీటిని వర్తింపజేశారు. 500 నుంచి 999 రూపాయల మధ్యలో ఎంఆర్‌పీ ధర ఉన్న ఐఎంఎఫ్ఎల్ మద్యం అమ్మకాలపై బాటిల్ ఒక్కింటికి 20 రూపాయలు, ఎంఆర్‌పీ 1,000 రూపాయలను దాటిన మద్యం అమ్మకాలపై బాటిల్ ఒక్కంటికి 40 రూపాయల మేర పెంచినట్లు ఆర్థికమంత్రి బాలగోపాల్ తెలిపారు. దీనివల్ల ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల మొత్తం అదనంగా ఖజానాకు వస్తుందని అంచనా వేసినట్లు వివరించారు.

అదనంగా వచ్చిన మొత్తాన్ని సామాజిక భద్రత సెస్ కు మళ్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ మోటార్ క్యాబ్‌లు, ఎలక్ట్రిక్ టూరిస్ట్ మోటార్ క్యాబ్‌లపై వన్-టైమ్ ట్యాక్స్ కొనుగోలు విలువను అయిదు శాతానికి తగ్గించినట్లు బాలగోపాల్ చెప్పారు. కేంద్రం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు, రుణ పరిమితిపై కోత విధింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు.
-
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications