వరుసగా 13వ రోజూ తగ్గిన పెట్రో ధరలు: నేటి ధరలు ఇవే
న్యూఢిల్లీ: వరుసగా 13వ రోజు కూడా పెట్రో ధరలు తగ్గడం వాహనదారులకు మరింత ఊరటనిచ్చింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో కొద్ది రోజులుగా దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే.
తాజాగా, మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర 20పైసలు తగ్గి రూ.79.55గా ఉంది. డీజిల్ లీటర్ ధర 7పైసలు తగ్గి రూ.73.85కు చేరింది.

ఇక ఇంధన ధరలు ఎక్కువగా ఉండే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 20పైసలు తగ్గి రూ.85.04గా ఉంది. లీటర్ డీజిల్ ధర 8పైసలు తగ్గి రూ.77.32కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.65కాగా, లీటర్ డీజిల్ ధర రూ.78గా ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.43గా, ఉండగా, డీజిల్ ధర రూ.75.63గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 21పైసలు తగ్గి 84.33గా ఉంది. డీజిల్ ధర 8పైసలు తగ్గి 80.25గా ఉంది.












Click it and Unblock the Notifications