భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్‌కు ఒక రూపాయి 34 పైసలు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌కు 2 రూపాయల 37 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
ఈ ధరల పెంపు ఆయా రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్రాలు విధించే లేవీలు వేర్వేరుగా ఉండడంతో ఆ ధరలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. గత రెండు నెలల కాలంలో పెట్రో ధరలు పెరగడం ఇది నాలుగో సారి.

చివరిసారి సెప్టెంబర్ 30వ తేదీన పెట్రోలు, డీజిల్ ధరలు మారాయి. అప్పుడు ఆయిల్ కంపెనీలు పెట్రోలు ధరను లీటర్‌కు 36 పైసలు పెంచగా, డీజిల్ ధరను లీటర్‌కు 7 పైసలు తగ్గించాయి. పెట్రోల్ ధర ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌కు రూ.64.57 ఉంది. డీజిల్ ధర లీటర్‌కు రూ.52.52 ఉంది.
ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రిన పెరిగిన ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అప్పుడు పెట్రోల్ పైన లీటర్‌కు రూ.3.38 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.67 పైసలు పెరిగింది.












Click it and Unblock the Notifications