Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2014 యూపీఏ హయాం కంటే భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంత ఉందంటే?

న్యూఢిల్లీ/హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. యూపీఏ హయాంలో చివరి ఏడాదిలో అంటే 2014 జనవరి నుంచి ఏప్రిల్ వరకు (మోడీ అధికారంలోకి వచ్చే వరకు) పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.70 నుంచి రూ.73 వరకు ఉంది. ఇప్పుడు అంతకంటే తగ్గింది. యూపీఏ హయాంలో ఇంధనం కోసం భారీగా చేసిన అప్పును నరేంద్ర మోడీ ప్రభుత్వం తీర్చింది. రూ.42వేల కోట్ల అప్పును తీర్చింది. దీంతో పెట్రోల్ ధరలు రూ.80కి పైగా ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత పెట్రోల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనం కావడంతో దేశీయ ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇంధన ధరలను మరోసారి సవరించాయి. దీంతో సోమవారం (డిసెంబరు 24) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర 21 పైసలు తగ్గి రూ.69.86కి చేరుకుంది. డీజిల్ ధర రూ.18 పైసలు తగ్గి 63.83కి చేరింది.

Petrol price falls below Rs 70 mark in Delhi, diesel below Rs 64/litre on Monday. Check rates here

ఇక వాణిజ్య రాజధాని ముంబైలో 21పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.75.48కి చేరింది. డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ.66.79 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ 54.67 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 46.06 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 22 పైసలు తగ్గి రూ.74.09 వద్ద, డీజిల్ ధర 20 పైసలు తగ్గి రూ.69.37 వద్దకు చేరింది. విజయవాడలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 21 పైసలు తగ్గి రూ.73.62 గా ఉంది. డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ.68.54గా ఉంది.

ఢిల్లీలో పెట్రోల్ రూ.69.86, డీజిల్ ధర రూ.63.83, ముంబై పెట్రోల్ రూ.75.48, డీజిల్ రూ.66.79, కోల్‌కతా పెట్రోల్ రూ.71.96 రూ.డీజిల్ రూ.65.59, చెన్నై పెట్రోల్ రూ.72.48, డీజిల్ రూ.67.38, బెంగళూరు పెట్రోల్ రూ.70.42, డీజిల్ రూ.64.18, తిరువనంతపురం పెట్రోల్ రూ.73.05, రూ.68.64, హైదరాబాద్ పెట్రోల్ రూ.74.09, డీజిల్ రూ.69.37, విజయవాడ పెట్రోల్ రూ.73.62, డీజిల్ రూ.68.54కు తగ్గింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+