లీటర్ పెట్రోల్‌పై 15, డీజిల్‌పై 17 పైసలు, వరుసగా ఐదోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచుతున్నట్టు చమురుసంస్థలు సోమవారం ప్రకటించాయి. ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో క్రూడయిల్ ధర 70 అమెరికా డాలర్లకి చేరింది. దీంతో ఆయా దేశాల్లో పెట్రో ఉత్పత్తలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
లీటర్ పెట్రోల్‌కి 15 పైసలు పెరగడంతో ఢిల్లీలో 75.69 పైసలకు చేరింది. గతేడాది 2018 నవంబర్ నుంచి ఢిల్లీలో పెట్రో ధరలు పెరగడం ఇదే తొలిసారి. అలాగే డీజిల్ ధర కూడా 68.68కి చేరింది. మధ్యప్రాచ్యలో ఉద్రిక్తతతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటు బంగారం ధర కూడా పెరగడం విశేషం. ఆరేళ్లలో గోల్డ్ రేట్ గరిష్టానికి చేరింది. సౌదీలో పెట్రో ఉత్పత్తులపై గతేడాది సెప్టెంబర్‌లో దాడులు జరిగిన తర్వాత.. చమురు ధరలు పెరగడం ఇదే మొదటిసారి.

చమురు ఉత్పత్తుల ధరలు పెరగడం స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. జపాన్ నుంచి హంకాంగ్ వరకు మార్కెట్లు పడిపోయాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 787.98 పాయింట్లు నష్టపోయి 40,676.63కి చేరింది. నిఫ్టీ 233.60 పాయింట్లు నష్టపోయి 11.933.05కి చేరింది.
అంతర్జాతీయ స్థాయిలో ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీగా సమీక్షిస్తాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ ధరను సమీక్షించి, నిర్ణయించడంతో మరుసటి రోజునుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. 2017 జూన్ నుంచి ఆయిల్ సంస్థలు రోజువారీ ధరలను సమీక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో రోజువారీగా సమీక్షించి, పెంచుతూ, తగ్గిస్తూ ఉన్నాయి.
-
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications