పెట్రోల్, డీజిల్ ధరల బాంబు మళ్లీ పేలింది- వాహనదారులకు భారీ వాత

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసల మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 0.87 పైసలు పెరిగి 99.54 రూపాలయకు చేరుకోగా, డీజిల్ ధర 0.91 పైసల మేర పెరిగి లీటరుకు రూ. 92.48గా నమోదైంది. దేశీయ ఎల్‌పిజి సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు, ఇది వినియోగదారులకు కొంత ఊరట కలిగించింది.

ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ నేడు ఉదయం 6 గంటల నుండి ఈ కొత్త ధరలను అమలు చేస్తున్నాయి. సరిగ్గా 10 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత పెట్రోల్, డీజిల్ లీటర్ పై ఏకంగా రూ.3.50 పైసల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు.

Petrol Up by Rs 0 87 Diesel by Rs 0 91 Paise Latest Fuel Hike by the Oil Marketing Companies India

ఆ తర్వాత ఈ నెల 19వ తేదీన మళ్లీ వాటి రేట్లను సవరించాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచాయి. ఇప్పుడు కూడా అవే రేట్లను ప్రాతిపదికన తీసుకున్నాయి. మళ్లీ అంతే మొత్తంలో ఇంధన రేట్లను సవరించాయి. దీంతో ప్రయాణం మరింత భారం కానుంది వాహనదారులకు.

ఈ పెరుగుదల ఇప్పట్లో ఆగకపోవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రోజూ 1,000 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూస్తూ వస్తోన్నామని చెబుతోన్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని భర్తీ చేసుకోవడానికి పెట్రోల్, డీజిల్ పై కనీసం 25 రూపాయలను పెంచాల్సి ఉంటుందనీ కేంద్రానికి ఇదివరకే ప్రతిపాదనలు సైతం పంపించాయి. తాజా పెరుగుదల.. దీనికి అనుగుణంగానే చోటు చేసుకుంటోంది.

ప్రధాన నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఇలా..

ఢిల్లీ- పెట్రోల్ రూ. 99.51 పైసలు, డీజిల్ రూ. 92.49 పైసలు

ముంబై- పెట్రోల్ రూ. 108.49 పైసలు, డీజిల్ రూ. 95.02 పైసలు

కోల్‌కతా- పెట్రోల్ రూ. 110.64 పైసలు, డీజిల్ రూ. 97.02 పైసలు

చెన్నై- పెట్రోల్ రూ. 105.31 పైసలు, డీజిల్ రూ. 96.98 పైసలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+