CD girl: మరో వీడియో విడుదల చేసిన సీడీ సుందరి, పేరు రాసి చచ్చిపోతా, నేరుగా వార్నింగ్!
బెంగళూరు/ హైదరాబాద్: మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీడీ సుందరి మరో వీడియో విడుదల చెయ్యడం కలకలం రేపింది. శనివారం సీడీ సుందరి విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. రాసలీలల సీడీ 24 రోజుల ముందు విడుదల కావడంతో ఆ రోజు సీడీ గర్ల్ మాయం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి మూడు వీడియోలు విడుదల చేసిన సీడీ సుందరి మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి నేరుగా వార్నింగ్ ఇచ్చింది. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, నా చావుకు మాజీ మంత్రి రమేష్ జారకిహోళి కారణం అని ఆయన పేరు రాసి చచ్చిపోతానని, ఆత్మహత్య చేసుకుంటానని శనివారం విడుదల చేసిన వీడియోలో సీడీ సుందరి మాజీ మంత్రికి నేరుగానే వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.

మీడియా అన్న నరేష్
సీడీ సుందరి శనివారం విడుదల చేసిన వీడియోలో ఆమె గోడు వెళ్లబోసుకునింది. తనకు మీడియాలో నరేష్ అనే యువకుడు తెలుసని అని చెప్పింది. అన్నా తనకు న్యాయం చెయ్యడానికి నువ్వు సహాయం చెయ్యాలని నేను నరేష్ కు చెప్పానని సీడీ సుందరి వివరించింది. నేను అన్నిట్లో చిన్నవాడిని, మనం పెద్దలను కలిస్తే నీకు న్యాయం జరుగుతోందని నరేష్ తనతో అన్నాడని సీడీ సుందరి చెప్పింది.

సిద్దరామయ్య, డీకే. శివకుమార్
మనం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ను కలిస్తే నీకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నరేష్ తనతో అన్నాడని సీడీ సుందరి చెప్పింది. నీకు న్యాయం జరగాలంటే అధికార పార్టీని ఎదుర్కొనే రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడు అవసరం అవుతారని, అందుకే మనం సిద్దరామయ్య, డీకే. శివకుమార్ ను కలవాలని నరేష్ తనకు చెప్పాడని సీడీ సుందరి వివరించింది.

ఇంటికి వెళితే లేరు... అప్పుడే ఆ ఆడియో లీక్
డీకే. శివకుమార్ ఇంటికి వెళ్లివస్తానని నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పానని సీడీ సుందరి చెప్పింది. తరువాత తాను డీకే. శివకుమార్ ఇంటికి వెళితే ఆయన అక్కడ లేరని, అంతలోనే నేను మా కుటుంబ సభ్యులతో నేను మాట్లాడిన ఆడియో టేప్ బయటకు రావడంతో మళ్లీ తనకు భయం పుట్టుకునిందని సీడీ సుందరి రమేష్ జారికిహోళి, ప్రభుత్వం మీద విమర్శలు చేసింది.

మాకు సెక్యూరిటీ లేదు
గత 24 రోజుల నుంచి నేను రహస్య ప్రాంతంలో ఉన్నానని, తనను ఎవ్వరూ కిడ్నాప్ చెయ్యలేదని సీడీ సుందరి వివరించింది. అయితే తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించిన తరువాతే తాను బయటకు వస్తానని సీడీ సుందరి తేల్చి చెప్పింది. సిట్ అధికారుల ముందు తాను పూర్తి సమాచారం ఇస్తానని సీడీ సుందరి స్పష్టం చేసింది

అమ్మానాన్న ముందే అన్నీ చెబుతా
సిట్ అధికారుల ముందు నేను హాజరైనప్పుడు అక్కడ కచ్చితంగా మా అమ్మా, నాన్న, అవ్వ, తమ్ముడు ఉండాలని, అప్పుడే సిట్ అధికారుల విచారణకు నేను కచ్చితంగా సహకరిస్తానని, మా కుటుంబ సభ్యులకు కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు రక్షణ కల్పించాలని సీడీ సుందరి శనివారం విడుదల చేసిన వీడియోలో మనవి చేసింది.

రమేష్ పేరు రాసి చచ్చిపోతా.... సీడీ సుందరి బ్లాక్ మెయిల్
రాసలీలల సీడీ విడుదలైన తరువాత మాయం అయిపోయిన సీడీ సుందరి ఇప్పటి వరకు ఎవ్వరికీ ప్రత్యక్షంగా కనపడకుండా రహస్య ప్రాంతం నుంచి వరుస వీడియోలు విడుదల చేస్తోంది. అయితే శనివారం విడుదల చేసిన వీడియోలో సీడీ సుందరి రమేష్ జారికిహోళికి నేరుగా వార్నింగ్ ఇచ్చింది. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నా, రమేష్ జారకిహోళి పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటానని సీడీ సుందరి మాజీ మంత్రికి నేరుగా వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది.
ఆయన కథ నాకు తెలుసు
ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నేను ఎవ్వర్నీ వదిలిపెట్టనని రమేష్ జారకిహోళి అంటున్నారని, ఆయన మాటలతో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని సీడీ సుందరి ఆరోపించింది. మంత్రి పదవితో చక్రం తిప్పిన రమేష్ జారకిహోళి కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వాన్ని ఒక్కరోజులో కూల్చేశాడని, ఆయన పలుకుబడి తనకు తెలుసని, ఆయన కోటీశ్వరుడు కావడంతో మమ్మల్ని అంతం చెయ్యడానికి కూడా వెనకడుగు వెయ్యడని సీడీ సుందరి సంచలన ఆరోపణలు చేసింది. వరుస వీడియోలు విడుదల చేస్తున్న సీడీ సుందరి మరోసారి ఎలాంటి వీడియో విడుదల చేస్తోందో అంటూ మళ్లీ జోరుగా చర్చ మొదలైయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications