బీజేపీలోకి కిరణ్ బేడీ: హర్ట్ అయిన అన్నాహజారే, మాట్లాడేందుకు నో!

న్యూఢిల్లీ: మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తనకు కూడా చెప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేరారని సామాజిక సంస్కర్త అన్నా హజారే ఆవేదన చెందుతున్నారట! అవినీతి పైన పోరులో ఎంతో సన్నిహితంగా మెలిగిన తనతో కూడా చెప్పకుండా కిరణ్ బేడీ బీజేపీలో చేరడాన్ని హజారే జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

బీజేపీలో చేరిన తర్వాత అన్నాహజారే ఆశీర్వాదం కోసం కిరణ్ బేడీ పలుమార్లు ప్రయత్నించారు. అయితే, ఆయన మాట్లాడేందుకు నిరాకరించారని తెలుస్తోంది. క్రియాశీల రాజకీయాల్లో చేరడాన్ని అన్నాహజారే మొదటి నుండి తప్పు పడుతున్నారు.

Phoned Anna Hazare several times, but could not talk: Kiran Bedi

ఇదే విషయమై కిరణ్ బేడీ స్పందించారు. అన్నా హజారేతో మాట్లాడేందుకు తాను పలుమార్లు ఫోన్ చేశానని, కొన్నిసార్లు నిద్రపోతున్నారని, మరికొన్నిసార్లు విశ్రాంతి తీసుకుంటున్నారని సమాధానం వచ్చిందని, రేపు మరోసారి ప్రయత్నం చేస్తానని ఆమె చెప్పారు.

కిరణ్ బేడీ తనకు కూడా చెప్పకుండా బీజేపీలో చేరడం అతనిని హర్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. కిరణ్ బేడీ గురువారం నాడు బీజేపీలో చేరారు. అప్పటి నుండి పలుమార్లు అన్నాహజారేకు ఫోన్ చేసి, మాట్లాడేందుకు ప్రయత్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+